12 ఏళ్ల తర్వాత EPFO నుంచి శుభవార్త.. అధిక పెన్షన్ పునరుద్ధరణ.. ఎవరికి వర్తిస్తుందంటే?

Wait 5 sec.

Higher : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అధిక పెన్షన్ ఆప్షన్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి బేసిక్ పే ఆధారంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి కంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పించిన పాత ఆప్షన్‌ను మళ్లీ తీసుకొచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. లబ్ధి చేకూరనుంది. అయితే, అది పరిమిత సెక్షన్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఉంటుందని, గతంలో హయ్యర్ పెన్షన్ కంట్రిబ్యూషన్స్ ఎంచుకున్న వారికే వర్తిస్తుందని తెలిపింది. 2014 సెప్టెంబర్‌లో ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పెన్షన్ వేతనంపై పరిమితి విధించినప్పటి నుంచి చాలా కాలంగా ఉన్న గందరగోళం నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. 2014, సెప్టెంబర్ 1వ తేదీన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కనీస పింఛను రూ.1000గా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పెన్షన్ పొందేందుకు అర్హత గల వేతన పరిమితిని నెలకు రూ.15000గా నిర్ణయించారు. బేసిక్ శాలరీ ప్లస్ డీఏ కలిపి గరిష్ఠంగా రూ.15000 వరకు మాత్రమే ఈపీఎస్‌లో కంట్రిబ్యూట్ చేసి పెన్షన్ పొందేందుకు అర్హత ఉంటుంది. దీంతో నెలవారి గరిష్ఠ పెన్షన్ రూ.7500 మాత్రమే లభించనుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు బేసిక్ శాలరీ, డీఏ రూ.15000 పైన ఉంటే వారు తమ పూర్తి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ పొందేందుకు అవకాశం ఉండదు. దీంతో వారు అధిక పెన్షన్ పొందలేకపోతున్నారు.గతంలోనే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ప్లస్ డీఏ ఆధారంగా కంట్రిబ్యూట్ చేసి అధిక పెన్షన్ పొందేందుకు ఆప్షన్ ఉండేది. సాధారణంగా ఈ ఆప్షన్ అనేది పబ్లిక్ సెక్టార్ కంపెనీల ఉద్యోగులు ఎంచుకునే వారు. అధిక మొత్తంలో కంట్రిబ్యూట్ చేసేవారు. ఈ కారణంగా చాలా మంది ఉద్యోగులు అధిక పెన్షన్ పొందారు. తమ బేసిక్ శాలరీలో దాదాపు సగం శాలరీ పెన్షన్‌గా అందుకున్నారు. అయితే, 2014, సెప్టెంబర్ 1 నుంచి పెన్షన్ పొందే శాలరీ పరిమితిని రూ.15000గా నిర్ణయించడంతో హయ్యర్ కంట్రిబ్యూషన్ ఆప్షన్ నిలిపివేశారు. దీంతో అప్పటికే హయ్యర్ కంట్రిబ్యూషన్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికి క్లారిటీ..టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఉద్యోగులు తమ పూర్తి బేసిక్ శాలరీ, డీఏ ఆధారంగా అధిక పెన్షన్ కోసం కంట్రిబ్యూట్ చేసే గతంలోని ఆప్షన్ పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త బెనిఫిట్ కాదని, గతంలో ఉన్న ఆప్షన్ పునరుద్ధిరించినట్లు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ టీఓఐ నివేదిక తెలిపింది. ఈ నిర్ణయం కేవలం 2014 సవరణకు ముందు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈపీఎఫ్ఓలోని సబ్‌స్క్రైబర్లు అందరికీ ఆటోమేటిక్‌గా వర్తించదు. అధిక మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తామని అంగీకారం తెలిపే వారికే వర్తిస్తుంది. అలాగే తమ కంపెనీ యాజమాన్యం ఆమోదం లేకుండా ఉద్యోగి ఒక్కడే ఈ నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఈపీఎఫ్ఓ కొత్త ఆర్డర్‌తో ఎవరికి లాభం?గతంలోని అనేది అర్హులైన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈపీఎఫ్ఓలోని చాలా తక్కువ మందికి మాత్రమే వర్తిస్తుందని తెలుస్తోంది. గతంలో హయ్యర్ కంట్రిబ్యూషన్ ఆప్షన్ ఎంచుకుని ఉన్న వారికే వర్తిస్తుందని సమాచారం. 2014కి ముందు ఎంచుకుని ఆ తర్వాత ఆగిపోయిన వారు ఇప్పుడు మళ్లీ ఎంచుకునే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చాలా వరకు ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15000గా నిర్ణయించారు. దాని ప్రకారమే కంట్రిబ్యూట్ చేసి పెన్షన్ పొందాల్సి ఉంటుంది.