సీనియర్లకు బెస్ట్ FD ఆప్షన్.. 1, 3, 5 ఏళ్లకు అధిక వడ్డీ ఇస్తోన్న.. టాప్-10 బ్యాంకులు ఇవే

Wait 5 sec.

FD Rates: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీగా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు సరైన మార్గం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మెరుగైన పెట్టుబడి మార్గంగా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు 50 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీ రేటు సైతం ఇస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడిని రక్షించుకునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద అధిక ఆసక్తి చూపుతారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది కాలంలో దీంతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఏ బ్యాంకులో, ఏ టెన్యూర్‌లో డిపాజిట్ చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. సీనియర్ సిటిజన్లకు ఇప్పటికీ కొన్ని బ్యాంకులు వివిధ టెన్యూర్లపై మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అంతే కాదు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ రక్షణ సైతం ఉంటుంది. రూ.5 లక్షలు దాటి డిపాజిట్ చేసే వారు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల కంటే ప్రముఖ ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులను ఎంచుకోవడం మంచిది. మరి ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో సీనియర్ సిటిజన్లకు 1, 3, 5 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇస్తోన్న టాప్-10 బ్యాంకుల జాబితా ఇప్పుడు మనం తెలుసుకుందాం. . అలాగే 3 ఏళ్లకు 7.50 శాతం, 5 ఏళ్లకు 6.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఆర్‌బీఎల్ బ్యాంకు ప్రస్తుతం సీనియర్లకు 1 ఏడాది టెన్యూర్‌పై 7.50 శాతం, 3 ఏళ్లకు 7.70 శాతం, 5 ఏళ్లకు 7.20 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంకులో సీనియర్లకు 1 ఏడాది డిపాజిట్లపై 7.25 శాతం, 3 ఏళ్లకు 7.40 శాతం, 5 ఏళ్లకు 7.15 శాతం వడ్డీ లభిస్తోంది. జేఅండ్ కే బ్యాంకులో ప్రస్తుతం సీనియర్లకు 1 ఏడాదికి 7.25 శాతం, 3 ఏళ్లకు 7.15 శాతం, 5 ఏళ్లకు 7.10 శాతం వడ్డీ లభిస్తోంది. యెస్ బ్యాంకులో ప్రస్తుతం సీనియర్లకు 1 ఏడాది టెన్యూర్ డిపాజిట్లకు 7.15 శాతం, 3 ఏళ్లకు అయితే 7.75 శాతం 5 ఏళ్లకు 7.50 శాతం వడ్డీ లభిస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రస్తుతం ఏడాదికి 7 శాతం, మూడేళ్లకు 6.60 శాతం, ఐదేళ్లకు 6.60 శాతం వడ్డీ లభిస్తోంది. సిటీ యూనియన్ బ్యాంకులో సీనియర్లకు ఏడాది టెన్యూర్ డిపాజిట్లపై 7 శాతం, 3 ఏళ్ల టెన్యూర్లపై 6.75 శాతం, 5 ఏళ్ల డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. కరూర్ వైశ్యా బ్యాంకులో ప్రస్తుతం 1 ఏడాదికి 6.95 శాతం, 3 ఏళ్ల డిపాజిట్లపై 6.95 శాతం, 5 ఏళ్లకు 6.95 శాతం వడ్డీ లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 1 ఏడాదికి 6.75 శాతం, 3 ఏళ్లకు 6.95 శాతం, 5 ఏళ్లకు 6.90 శాతం వడ్డీ లభిస్తోంది.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1 ఏడాదికి 6.70 శాతం, 3 ఏళ్లకు 5.75 శాతం, 5 ఏళ్లకు 5.50 శాతం వడ్డీ లభిస్తోంది.