అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో తర్వాత పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ హాట్ టాపిక్ అయ్యాడు. అచ్చం అమీర్ చెప్పినట్టే టీమిండియా ఓడిపోవడం, అభిషేక్ శర్మ ఫెయిల్ అవ్వడంతో టాక్ ఆఫ్ ది ట్విటర్‌గా మారాడు. భారత్ ఓటమిపై పగలబడి నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి ముందే అమీర్, భారత్ సెమీఫైనల్‌కు చేరడం కష్టమేనని అంచనా వేశాడు. అప్పట్లో దీనిపై భారత అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేశారు. కానీ మ్యాచ్ ఫలితం అమీర్ చెప్పినట్టే రావడంతో, అతడు పాకిస్తాన్ టీవీ చానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్నాడు. యాంకర్ అతడిని జ్యోతిష్యుడు అంటూ పరిచయం చేయగానే అమీర్ నవ్వుతూ “దేవుడా నన్న క్షమించి, నాకు ఏంటి ఇది” అంటూ స్పందించాడు.ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై అమీర్ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు వచ్చాయి. బ్యాటింగ్‌లో భారత్ పూర్తిగా కుప్పకూలింది. తొలి ఓవర్లోనే ఎయిడెన్ మార్కరమ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ త్వరగా పెవిలియన్ చేరారు. అభిషేక్‌ను మార్కో యాన్సన్ ఔట్ చేశాడు.ఈ క్రమంలో శివమ్ దూబే చేసిన 42 పరుగులే భారత్‌కు కొంత పరువు నిలబెట్టాయి. చివరికి భారత్ 111 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు దక్షిణాఫ్రికా 187/7 స్కోర్ చేసింది. డేవిడ్ మిల్లర్ (63), డివాల్డ్ బ్రెవిస్ కీలక భాగస్వామ్యం జట్టుకు బలం ఇచ్చింది. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇకపై జింబాబ్వేతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనుంది. మొత్తానికి అమీర్ చెప్పినట్టే టీమిండియా ఇప్పుడు డేంజర్ జోన్‌లో పడింది.