వైఎస్సార్‌సీపీలో చేరడం లేదు.. వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్

Wait 5 sec.

తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వంగవీటి మోహనరంగా కుటుంబం నుంచి కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇటీవల రంగా కుమార్తె ఆశాకిరణ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారు. కొంతకాలంగా ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. పొలిటికల్ ఎంట్రీ ఖాయం అని చెబుతున్నారు. ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ ఇవ్వలేదు.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఏ పార్టీలో చేరేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో కొంతమంది వంగవీటి ఆశాకిరణ్ వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం చేస్తు్న్నారు. అయితే తాను వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆశాకిరణ్ స్పందించారు.సోషల్ మీడియా వేదికగా తాము వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు . ఆమె మార్కాపురం జిల్లాలోని చారిత్రక కంభం చెరువును సందర్శించారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీతో పాటుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు కొంతమంది కావాలనే పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారు అన్నారు. తాను రాష్ట్రవ్యాప్తంగా రాధా, రంగా మిత్రమండలిని ఏకతాటిపైకి తెచ్చి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాను అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సమయం ఉందన్నారు ఆశాలత. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అభిమానుల అభిప్రాయం మేరకే ఉంటుందని తేల్చి చెప్పారు ఆశాకిరణ్.తన తండ్రి వంగవీటి రంగా పేదల కోసం జీవించారని.. వారి కోసమే ప్రాణత్యాగం చేశారని పలు సందర్భాల్లో ఆశాకిరణ్ తెలిపారు. తన తండ్రి రంగా వారసత్వాన్ని కొనసాగించేందుకు తాను ప్రజల్లోకి వస్తున్నాను అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాను పర్యటిస్తానని.. బీసీలు, విద్యార్థుల్ని కలిసి రాధా రంగా మిత్రమండలిని మరింత బలోపేతం చేస్తానన్నారు. మొత్తానికి వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు. తాము వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు అంటున్నారు.