AP Senior IPS పీవీ సునీల్‌కుమార్‌ రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్‌లోనే.. ఉత్తర్వులు జారీ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 24తో ఆయన సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో.. ఈ నెల 18న రివ్యూ కమిటీ భేటీ అయ్యింది. ఈ మేరకు అందుకు అనుగుణంగా మరోసారి ఆ గడువును పొడిగించారు.. సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పీవీ సునీల్ కుమార్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ నమోదయ్యాయి.. అవి తొలగేంతవరకు లేని పక్షంలో జూన్ 30న పదవీవిరమణ చేసే వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ సునీల్‌కుమార్‌పై సస్పెన్షన్ తొలగిస్తే.. ఆయనపై ఉన్న కేసులో విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఏపీ ప్రభుత్వం 2025 మార్చి 2న ను మొదటిసారి సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లారన్న అభియోగాలు ఉన్నాయి.. అందుకే నిబంధనలకు విరుద్ధంగా వెళ్లినందుకు సస్పెండ్ చేయగా.. అది కొనసాగుతోంది. 2025 ఆగస్టు 28 వరకూ..ఈ ఏడాది ఫిబ్రవరి 24 వరకూ మరోసారి సస్పెన్షన్‌ పొడిగించారు. అలాగే అగ్రిగోల్డ్‌ నిధుల దుర్వినియోగం, రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసుల్లో సునీల్‌ కుమార్‌పై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై సునీల్‌కుమార్ వ్యాఖ్యలు చేసిన అంశంపై నివేదిక ఇంకా సమర్పించలేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన కేసులో సీఐడీ అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది. అయితే ఆ సమయంలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదుతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. పీవీ సునీల్ కుమార్ ఈ కేసులో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల అంశంలో కూడా రఘురామ పీవీ సునీల్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు.. ఈ కేసులో ఏసీబీ విచారణ జరుగుతోంది. మొత్తం మీద పీవీ సునీల్‌‌కుమార్‌ సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది.