: దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. బంగారానికి గిరాకీ పెరిగింది. అయితే, ఇదే సమయంలో భారీగా పెరిగి ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. ఈరోజు శాంతించాయి. వరుస ధరల పరుగుకు బ్రేక్ పడింది. ఈరోజు బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. మహిళలు సహా ఇతర కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో దేశీయంగా మళ్లీ రేట్లు పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా గిరాకీ అధికంగానే ఉంటుంది. దీంతో ధరలు మరింత పెరుగుతాయి తప్పా తగ్గే అవకాశాలే లేవని బులియన్ వర్గాలు అంటున్నాయి. అందుకే ధరలు మళ్లీ పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిది. ఈ క్రమంలో ఫిబ్రవరి 23వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేటు, కిలో ఎంతెంత పలుకుతున్నాయి అనే వివరాలు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 92.34 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర 5150 డాలర్లు దాటి ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 5.36 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 86.61 డాలర్లు దాటేసింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్ప ఊరట కల్పించాయి. ఈరోజు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు తులం (10 గ్రాములు) రూ.1,59,280 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,46,000 పలుకుతోంది. అయితే, గత మూడు రోజుల్లో తులం రేటు ఏకంగా రూ.4600 పైన పెరిగిన సంగతి తెలిసిందే. ముందు ముందు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. కొనుగోలుకు ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. స్థిరంగానే వెండి రేటుబంగారంతో పాటు వెండి రేటు సైతం శాంతించింది. ఈరోజు వెండి ధరలు సైతం స్థిరంగానే ఉన్నాయి. క్రితం రోజు కిలో వెండి రేటు రూ.20 వేలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,90,000 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా వెండి ధరలు మళ్లీ భారీగా పెరగడం దేశీయంగా ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.