ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీమ్.. ఇంకొక్క రోజే ఛాన్స్.. రూ. 5 వేలతో చేరొచ్చు!

Wait 5 sec.

Mutual Fund Investments: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఐపీఓ అంటే ఎంత సుపరిచితమో.. మ్యూచువల్ ఫండ్లలో ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) అలాగే. ఇక్కడ ఏదైనా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా స్కీమ్ ప్రకటించి.. నిధులు సేకరించడాన్నే ఎన్ఎఫ్ఓ అంటారు. ఇక్కడ ముందుగా నిర్దిష్ట కాల పరిమితిలోపు సబ్‌స్క్రిప్షన్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఇక్కడ ముందుగా తక్కువ ధరకే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. తర్వాత రెగ్యులర్‌గా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు .. మరో కొత్త స్కీం లాంఛ్ చేసింది. ఈ ఎన్ఎఫ్ఓ ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. అదే ఎస్బీఐ Nifty మిడ్‌క్యాప్ 150 మొమెంటమ్ 50 ETF స్కీమ్. >> ఇది ఒక పాసివ్ ఫండ్ రకానికి చెందిన ఓపెన్ ఎండెడ్ ఈటీఎఫ్ పథకం. ఈ పథకం పనితీరుకు కొలమానంగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఉంది. ఇందులో సబ్‌స్క్రిప్షన్ చేసుకునేందుకు ఆఖరి తేదీ 2026, ఫిబ్రవరి 24గా ఉంది. అంటే మరొక్క రోజే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మిడ్ క్యాప్ సెగ్మెంట్‌లో మొమెంటమ్ వ్యూహంతో పనిచేస్తుంది. ఇక్కడ ప్రధానంగా నిఫ్టీ 150 మిడ్ క్యాప్ 150 ఇండెక్స్‌లోని కంపెనీల్లో గడిచిన 6-12 నెలల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినటువంటి టాప్- 50 షేర్లను ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ తన ఆస్తుల్లో 95 నుంచి 100 శాతం వరకు నిధుల్ని.. ఈ 50 షేర్లలోనే పెడుతుందని చెప్పొచ్చు. 5 శాతం వరకు G-Secs, SDLs, ట్రెజరీ బిల్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రభుత్వ సెక్యూరిటీలకు కేటాయిస్తుంది. కనీసం రూ. 5 వేల ప్రారంభ పెట్టుబడితో ఇందులో చేరొచ్చు. ఆపైన ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇది ఈటీఎఫ్ స్కీమ్ కాబట్టి ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. ఫిబ్రవరి 24 తర్వాత కాస్త గ్యాప్‌తో మళ్లీ రెగ్యులర్‌గా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు సిప్ పెట్టుబడులు కూడా పెట్టొచ్చు. సాధారణంగానే మిడ్ క్యాప్ షేర్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇంకా ఇది మొమెంటమ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి.. మార్కెట్ పడిపోతున్న సమయంలో రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్‌ను తట్టుకొనే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఈ ఫండ్ మేనేజర్‌గా వైరల్ ఛద్వా ఉన్నారు. Disclaimer: మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పైన ఇచ్చింది కేవలం సమాచార ప్రయోజనాల కోసమేనని తెలుసుకోవాలి. అందుకే.. ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. మీ పెట్టుబడి సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, స్థోమత ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.