రూ.10 వేల పొదుపుతో.. 10 ఏళ్లలోనే రూ.33 లక్షలొచ్చాయ్.. హైరిటర్న్స్ ఇచ్చిన స్కీమ్ ఇదే

Wait 5 sec.

: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ప్రధానంగా కోరుకునేది దీర్ఘకాలంలో స్థిరమైన రాబడి. గడిచిన దశాబ్ద కాలంలో డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ రికార్డ్ స్థాయిలో రాణించింది. ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏదైతే కోరుకుంటారో అంతకు మించిన రాబడులు అందించింది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఇండెక్స్, కేటగిరీ సగటును మించి రాణించి కాసుల వర్షం కురిపించింది. గత అయితే, రిటర్న్స్ నంబర్లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో వచ్చిన రిటర్న్స్ భవిష్యత్తులో వస్తాయనే గ్యారెంటీ ఉండదు. ఈక్విటీ ఫండ్స్‌లో ముఖ్యంగా వెరీ హైరిస్క్ కేటగిరీలో ఉన్న ఫండ్స్ ఎంచుకుంటే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. పరాగ్ పరీఖ్ మ్యూచువల్ ఫండ్ () తీసుకొచ్చిన పరాగ్ పరీఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 3,5,10 ఏళ్లలో అంచనాలు మించి రాణించింది. ఇన్వెస్టర్లకు లంప్ సమ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడులపై హైరిటర్న్స్ ఇచ్చింది. లంప్ సమ్ విధానం అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి వదిలేయడం విధానంలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే గత 3 సంవత్సరాల్లో 20.89 శాతం సగటు వార్షిక రాబడితో రూ. 1,76,694 అందించింది. అదే గత ఐదేళ్లలో అయితే 18.46 శాతం వార్షిక రాబడితో రూ. 2,33,242 అందించింది. అలాగే గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ ఫండ్ సగటు వార్షిక రాబడి 19.24 శాతంగా ఉంది. దీని ప్రకారం లక్ష పెట్టుబడి రూ. 5,80,877 అవుతుంది. పొదుపు చేసిన వారికి సగటున 13.73 శాతం వార్షిక రాబడి అందించింది. అంటే రూ. 4.40 లక్షలు అందించింది. అలాగే గత 5 సంవత్సరాల కాలంలో సగటు రాబడి 16.18 శాతం ఉంది. దీని ప్రకారం రూ. 10 వేల పెట్టుబడితో రూ. 8.95 లక్షలు వస్తాయి. అలాగే గత 10 సం వత్సరాల్లో చూసుకుంటే ఏడాదికి 19.20 శాతం చొప్పున రాబడి అందించింది. దీని ప్రకారం రూ. 10 వేల పెట్టుబడితో ఏకంగా రూ. 32.83 లక్షలు వస్తాయి. అయితే, ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. గతంలో వచ్చిన రిటర్న్స్ ముందు ముందు వస్తాయని గ్యారెంటీ ఉండదు. స్కీమ్ గురించిన వివరాలు ముందుగా తెలుసుకోవడం మంచిది.