ఏఐ ఉద్యోగాల్లో 'హైదరాబాద్' సహా మెట్రో నగరాల జోరు.. ఫ్రెషర్లకు అదిరే శుభవార్త!

Wait 5 sec.

AI Jobs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాల్లో మెట్రో నగరాలు దూసుకెళ్తన్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై ప్రాంతాల్లో అత్యధికంగా ఏఐ ఉద్యోగాలు ఉంటున్నాయి. నౌకరీ.కామ్ పోర్టల్‌లో దాదాపు 70 శాతం ఏఐ సంబంధిత ఉద్యోగాలు ఈ మూడు నగరాల్లోనే ఉన్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ కంపెనీ సీబీఆర్ఈ విడుదల చేసన ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించి రిపోర్ట్ తయారీ చేసినట్లు సీబీఆర్ఈ తెలిపింది. హైదరాబాద్ నగరం టాప్-5లో నిలిచింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం ఏఐ సంబంధిత ఉద్యోగాల్లో బెంగళూరులోనే అత్యధికంగా లభిస్తున్నాయి. బెంగళూరు నగరం 25.4 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత రెండో స్థానంలో 24.8 శాతం వాటాతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం నిలవగా ముంబై నగరం 19.2 శాతం వాటాతో మూడో స్థానంలో ఉన్నాయి. వీటి తర్వాత ఏఐ ఉద్యోగాల మార్కెట్లో హైదరాబాద్ నగరం 12.5 శాతం వాటాతో 4వ స్థానంలో ఉంది. దీని తర్వాత పుణె నగరం 9.6 శాతం వాటా, చెన్నై నగరం 6.4 శాతం వాటా, కోల్‌కతా 2.1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. నౌకరీ పోర్టల్‌లో ఏఐ కింద నమోదైన ఉద్యోగ లిస్టింగుల డేటాను తీసుకున్నట్లు సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ఈ రిపోర్ట్ దేశంలోని మొత్తం ఏఐ ఉద్యోగాల మార్కెట్‌ను ప్రతిబింబించినట్లు సీబీఆర్ఈ తెలిపింది. , కస్టమర్ సేవలు, కార్యకలాపాల రంగాల్లో నియామకాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు బెంగళూరులో ఉండడంతో ఏఐ ఉద్యోగాల్లో ఈ సిటీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఏఐ అనేది ఒక చర్చాంశం మాత్రమే కాదని, భారత ఆర్థిక వృద్ధిలో కీలక భాగమని సీబీఆర్ఈ ఇండియా ఛైరమన్ పేర్కొన్నారు. ఫ్రెషర్లకు శుభవార్తకొత్తగా డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చూస్తున్న ఫ్రెషర్లకు ఇది పండగలాంటి వార్త. 2026 ప్రథమార్థం అంటే జనవరి- జూన్ మధ్య కాలంలో ఫ్రెషర్ల నియామకాలు చేపట్టేందుకు 73 శాతం వరకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు టీమ్ లీజ్ ఎడ్ టెక్ కెరీర్ ఔట్ లుక్ నివేదిక తెలిపింది. 73 శాతం కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలకు మొగ్గు చూపినట్లు తెలిపింది. అంత క్రితం ఆరు నెలలతో పోలిస్తే ఈసారి 3 శాతం ఎక్కువ కంపెనీలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయట. దేశంలోని పలు నగరాలు, పరిశ్రమలకు చెందిన దాదాపు 1051 కంపెనీల నుంచి సేకరించిన సమాచారంతో ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు తెలిపింది.