ఐడీఎఫ్‌సీలో రూ.590 కోట్ల మోసం.. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై ఎఫెక్ట్.. పడిపోతున్న షేరు, ఏం జరిగిందంటే?

Wait 5 sec.

: ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఒకటైన (AU Small Finance Bank) షేరు సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీన భారీగా పడిపోయింది. ఒక దశలో 6 శాతానికిపైగా పతనమైంది. అందుకు ఓ ప్రధాన కారణం ఉంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై పడింది. ఈ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నుంచి హరియాణా ప్రభుత్వం తొలగించింది. దీంతో ఏయూ బ్యాంక్ షేరు పడిపోతోంది. వెంటనే స్పందించిన బ్యాంక్ రెండు నిర్దిష్ట ఖాతాలకు సంబంధించి అంతర్గత సమీక్షను ప్రారంభించినట్లు ప్రకటించింది. అవసరమైన అన్ని కేవైసీ తనిఖీలు, అవసరమైన అధికారాలను పూర్తి చేసిన తర్వాత అంతర్గత విధానాలు, ప్రక్రియలకు పూర్తిగా అనుగుణంగా రెండు ఖాతాలు తెరిచినట్లు పేర్కొంది. చండీగఢ్ బ్రాంచీలో రూ.590 కోట్లు ప్రభుత్వ ఖాతాల్లో మోసాలకు ఉద్యోగులు పాల్పడినట్లు తేలిన క్రమంలో బ్యాంకుపై నిషేధం విధించింది. ఈ కేసులో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నలుగులు బ్యాంకు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఫిబ్రవరి 16, 2026న హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం.. తమ నిర్దిష్ట ఖాతా వివరాలు , లావాదేవీ రికార్డులను ఇవ్వాలని ఏయూ బ్యాంకుకు సందేశం పంపింది. ఈ క్రమంలో బ్యాంకు నుంచి అకౌంట్ల వివరాలు పూర్తిగా అందించినట్లు ఏయూ బ్యాంక్ తెలిపింది. ఆ తర్వాత ఫిబ్రవరి 18వ తేదీన ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ అకౌంట్, ఇతర బ్యాంక్ కస్టమర్ అకౌంట్ మధ్య జరిగిన అనధికారిక ట్రాన్సాక్షన్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ బిజినెస్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్ల అదే రోజున హరియాణా ప్రభుత్వ ఫైనాన్స్ విభాగం నుంచి సమాచారం అందింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు ధర భారీగా పడిపోతోంది. ఈ స్టాక్ సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూ.990 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.998ని తాకింది. ఆ తర్వాత ఇంట్రాడే లో ఒక స్థాయిలో 6 శాతానికిపైగా పడిపోయి రూ.950 ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి 5.93 శాతం నష్టంతో రూ.968.60 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1039, కనిష్ఠ ధర రూ.478.35 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.72,450 కోట్లుగా ఉంది.