తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక అందుకున్నారు. ఆ వర్సిటీ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా ఏఐ పాలసీ సింపోజియం నిర్వహిస్తుండగా.. ఇందులో ప్రసంగించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపింది. మార్చి 27న ఈ కార్యక్రమం జరుగనుంది. ఇండియా నుంచి ఈ ఆహ్వానం అందుకున్నది రేవంత్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. ఈ సింపోజియంలో “మౌలిక సదుపాయాలు, కంప్యూట్ శక్తిగా ఏఐ.. జీవన సామర్థ్యం, శ్రామిక శక్తిపై ప్రభావం (AI as Infrastructure And Compute Power: Impact on Livability And Workforce)’ అనే అంశంపై ప్రసంగించాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్ల ప్రభావంపై ఈ సింపోజియంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా, ఏఐ ఎకోసిస్టమ్, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాలు.. భూ, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని కోరారు. ఇటీవల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా హార్వర్డ్ వర్సిటీ అధికారు.. ప్రత్యేకంగా సీఎంను కలిసి సింపోజియంపై చర్చించారు.ప్రభుత్వ, పారిశ్రామిక, విద్య రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలన, భౌగోళిక రాజకీయం, నాలెడ్జ్ ఎకానమీ,, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు. హార్వర్డ్ తనను ఆహ్వానిస్తూ పంపిన లేఖను ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు.కాగా, హార్వర్డ్‌లో వారం రోజుల సర్టిఫికెట్ కోర్సు ఇటీవల పూర్తిచేశారు. జనవరి 25-30 మధ్య, కెన్నెడీ స్కూల్‌లో 21వ శతాబ్దపు నాయకత్వం' అనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఈ కోర్సును అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల కోసం రూపొందించింది. కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా.. జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లు, సమస్యల పరిష్కారంపై ఈ కోర్సు దృష్టి సారిస్తుంది. ఈ సందర్భంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌ (HBS)లోని భారతీయ విద్యార్థులతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ గురించి విద్యార్థులకు సీఎం వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి కోరారు.