జబర్దస్త్ అంటే ఒకప్పుడు ఇంటిల్లిపాది ప్రతి వారం హాయిగా నవ్వుకున్న ఒక కామెడీ షో అనే గుర్తొస్తుంది. ఎన్నో ఏళ్ల పాటు ఆడియన్స్‌ని నవ్వించి టీఆర్పీ రేటింగ్‌లో కూడా దుమ్మురేపిన ఈ షో కొన్నాళ్లుగా వెనకబడిన సంగతి తెలిసిందే. ఆనాటి కమెడియన్లు వెళ్లిపోవడం.. ఉన్నవాళ్లు పక్క ఛానల్స్‌కి వెళ్లిపోవడంతో జబర్దస్త్ ప్రాభవం పూర్తిగా తగ్గింది.అయితే ఈ షోకి పూర్వ వైభవం తెచ్చేందుకు మల్లెమాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జడ్డీలని మార్చడం.. రష్మీతో పాటు మానస్ నాగులపల్లిని మరో యాంకర్‌గా తీసుకురావడం ఇలా చాలానే చేశారు. కానీ ఏవీ కలిసిరాలేదు. దీంతో కొంతకాలంగా కామన్ పీపుల్‌కి జబర్దస్త్ స్టేజ్ మీద కామెడీ చేసే అవకాశం కూడా ఇస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో అయితే రెండు కొత్త టీమ్స్‌ని దించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం.సుధీర్-రష్మీపై పంచులువైజాగ్ టీమ్ అయితే వచ్చీ రాగానే సుధీర్ రష్మీ మీద పంచులు స్టార్ట్ చేశారు. మేడమ్ మీరు ఒక మూడు నెలలు విదేశాలకి వెళ్లకుండా ఇక్కడే ఉండరా.. అని ఖుష్భూతో అన్నారు. ఎందుకని అడిగితే.. సమ్మర్ వస్తుంది కదా చందమామ దగ్గరగా ఉండే చల్లగా ఉంటుందని.. అంటూ పులిహోర కలిపారు. అక్కడుందే ఆమే రష్మీ.. ఈ జబర్దస్త్‌కి జూలియట్.. అని అనగానే మరి రోమియో ఎక్కడున్నాడని అడిగారు. ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు.. మనకెందుకు.. అంటూ సుధీర్‌పై పంచులేశారు.మధ్యలో ఎవరిదారి వాళ్లు చూసుకోవడానికి నేనేమైనా సుధీర్‌తో ప్రయాణిస్తున్నానా.. మావారితో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నానని మరో పంచ్ వేశారు. ఆ ప్రయాణంలో ముందు ముందు నీకే తెలుస్తుందమ్మా.. అంటూ రష్మీ కూడా గట్టిగానే కౌంటర్ వేసింది.కృష్ణ భగవాన్ స్కిట్ఇక కరీంనగర్ టీమ్ కూడా తమదైన యాసతో స్టేజ్ మీద బాగానే నవ్వించారు. ఇక ప్రోమోలో కృష్ణ భగవాన్ స్కిట్ చేయడం హైలెట్ అయింది. ఏరా పనోడా గాడిదని తీసుకొచ్చావేంటని రాం ప్రసాద్‌ని చూడగానే కృష్ణ భగవాన్ పలకరించారు. పనోడు నేను కాదు వాడని ఆర్పీ అనగానే నేను అడిగింది కూడా వాడినే.. అంటూ భగవాన్ పంచ్ వేశారు.అయ్యగారు మీరు కూర్చుంటే మహేష్ బాబులా ఉన్నారని రాం ప్రసాద్‌కి పనోడు బిస్కెట్ వేయగానే ఇదిగో 100 తీసుకో.. అంటూ ఆర్పీ ఇచ్చాడు. అయ్యగారు మీరు నడిచొస్తుంటే ప్రభాస్‌లా ఉన్నారని కృష్ణ భగవాన్ తన పనివాడు అడిగాడు. నీ దగ్గర రెండు 500 నోట్లు ఉన్నాయా.. ఇలాగివ్వు.. అని తీసుకొని జేబులో పెట్టుకున్నారు. అదేంటి ఇవ్వరా నాకు అని పనివాడు అడిగితే పొగిడితే పడిపోవడానికి నేను వాడంత వెధవని కాదు.. అంటూ భగవాన్ కౌంటర్ వేశారు.ఊరికి ప్రెసిడెంట్ అంటున్నారు కదా.. ఇంతకీ ఊరిలో ఏం చేస్తుంటారని ఆర్పీ అడిగితే బ్రిడ్జి కట్టిద్దాం అనుకుంటున్నానని కృష్ణ భగవాన్ అన్నారు. డబ్బుల్లేవు కదా మీ దగ్గర.. అని ఆర్పీ అడిగితే అనుకుంటున్నాను.. అనుకోవడానికి డబ్బులెందుకు.. అంటూ భగవాన్ నవ్వించారు. రాత్రి మాములు కల రాలేదు తెలుసా.. నేను జబర్దస్త్‌కి జడ్జి అయిపోయి జడ్జిమెంట్ ఇచ్చానంట తెలుసా.. అని ఆర్పీ డబ్బా కొట్టాడు. రాత్రి నాకు ఒక కల వచ్చింది.. అనసూయ, రష్మీ కలిసి తెగ కితకితలు పెట్టేశారని భగవాన్ అన్నారు. మరి నన్ను పిలవలేదే.. అని ఆర్పీ అడిగితే అప్పుడు నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నావ్.. అంటూ మళ్లీ పంచ్ వేశారు. ఇలా భగవాన్ స్కిట్ మాత్రం అదిరింది.