చైనా కుట్రతోనే భారత్, రష్యాలు దూరమయ్యాయి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

భారత్, రష్యా సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా కుట్రల వల్ల భారత్, రష్యాలను కోల్పోయామని, వారికి దూరమయ్యాయమని ట్రంప్ పేర్కొన్నారు. ఆ రెండు దేశాలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జింగ్‌పింగ్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. పోస్ట్ పెట్టారు. మోసకారి చైనాకు రెండు దేశాలూ దగ్గరయ్యాయని ట్రంప్ ఆరోపించారు. ఎస్‌సీఓ సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌ల భేటీపై ట్రంప్ పరోక్షంగా తొలిసారి స్పందించారు.