కేజ్రీవాల్ రెండోసారి, మూడోసారి సీఎం అవ్వడానికి కారణం ఇదే.. నేను కూడా అదే ఫాలో అవుతున్నా: రేవంత్ రెడ్డి

Wait 5 sec.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి () హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యా రంగంలో ఉపాధ్యాయుల కృషి, సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తుచేస్తూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రజల్లో విశ్వాసం నింపేలా వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “నేను మొదటిసారి ఒక పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యాను. కానీ రెండోసారి, మూడోసారి కూడా నేను ఈ బాధ్యతను నిర్వర్తిస్తాను. ఆ శక్తి నాకు మీతో కలసి చేసే పనుల ద్వారానే వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ను ఉదాహరణగా చూపుతూ.. ఆయనను రెండోసారి, మూడోసారి అధికారంలోకి తెచ్చింది ఆయన విద్యా సంస్కరణలే అని గుర్తు చేశారు. “అదే మార్గంలో మనం కూడా సాగాలి. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తేనే రాష్ట్రానికి శాశ్వత అభివృద్ధి కలుగుతుంది” అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ.. “నాకు కూడా స్వార్థం ఉంది. మీరు పిల్లలకు మంచి విద్య అందిస్తేనే నేను మళ్లీ సీఎం అవుతాను. కానీ నేను కేవలం ఆదేశాలు ఇచ్చే నాయకుడిని కాదు. నేనూ మీతో పాటు కష్టపడతాను. మీరు ఎక్కడికి రామ్మంటే అక్కడికే వస్తాను. పల్లెలకైనా, గూడాలకైనా, తండాలకైనా వచ్చి మీతో కలిసి పనిచేస్తాను” అన్నారు. “నేను నల్లమల్ల అటవీ ప్రాంతంలోని గ్రామం నుంచి వచ్చాను. జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్నా, నా గ్రామాన్ని మరువను. ఆరు నెలలకొకసారి నేను నా ఊరికి వెళ్లి ఒకరోజు గడుపుతాను. మన మూలాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అదే మన బలమవుతుంది. ఉపాధ్యాయులు కూడా అప్పుడప్పుడు తమ మూలాలను గుర్తు చేసుకోవాలి” అని సూచించారు. సీఎం విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు తెలియజేశారు. పేదలకు ఉచితంగా, నాణ్యమైన విద్య అందించడం నా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి చెందాలి. ప్రతి విద్యార్థి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే స్థాయిలో విద్యా నాణ్యత పెంచాలి. ఉపాధ్యాయులు ఈ కృషిలో ముఖ్యమైన భాగస్వాములు అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే చర్యలు చేపడుతుందని.. డిజిటల్ లెర్నింగ్, ఇంగ్లీష్ మాధ్యమ బోధన, నూతన సిలబస్ రూపకల్పన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. “ప్రతి పిల్లవాడు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగలిగేలా చేయడం నా బాధ్యత” అని సీఎం తెలిపారు.