గుంటూరు జిల్లా దృష్టి సారించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు తురకపాలెం మరణాలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో శుక్రవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. తురకపాలెంలో జులై, ఆగస్ట్ నెలల్లోనే 20 మంది చనిపోవడం వెనుక కారణాలపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. అన్నికోణాల్లోనూ పరిశీలించి, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తురకపాలెనికి శని, ఆదివారం రోజులలో ప్రత్యేక వైద్య బృందాలు పంపించాలని, గ్రామస్థులు అందిరకీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం నాటికల్లా తురకపాలెం గ్రామస్థుల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.గా పరిగణించాలన్న సీఎం చంద్రబాబు.. అనారోగ్యం ఎక్కువగా ఉన్నవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి, అత్యవసర చికిత్స అందించాలన్నారు. తురకపాలెం మరణాల వెనుక కారణాలను కనిపెట్టేందుకు ఎయిమ్స్‌తో పాటుగా కేంద్ర వైద్య బృందాలను రప్పించాలని చంద్రబాబు ఆదేశించారు. అవసరం అనుకుంటే అంతర్జాతీయ వైద్య నిపుణుల సహాయం కూడా తీసుకోవాలన్నారు. బ్యాక్టీరియా అనేది తిండి, గాలి, నీరు, భూమి ఇలా ఎక్కడి నుంచైనా వ్యాపించే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో తురకపాలెం ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలని ఆదేశించారు. వాతావరణ పరిశుభ్రత, ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తురకపాలెంలో ఇకపై కొత్త కేసులు నమోదు కాకూడదని.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యారోగ్య శాఖ అధికారులపై ఉందన్నారు.మరోవైపు తురకపాలెం కేసులను పరిశీలిస్తే మెలియోయిడోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చంద్రబాబుకు నివేదించారు. గ్రామంలో నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపామని, ఒకట్రెండు రోజుల్లో రిపోర్టులు వస్తాయని వివరించారు తురకపాలెంలో బీపీ, డయాబెటిస్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఉన్నవారు ఉన్నారని.. అలాగే మద్యం వినియోగం అధికంగా ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఈ గ్రామం ఉండే ప్రాంతంలో స్టోన్ క్రషర్లు ఎక్కువగా ఉన్నాయన్న అధికారులు.. వాతావరణ నాణ్యతను కూడా పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. మెలియోయిడోసిస్ ముఖ్యంగా భూమి, నిల్వ ఉండే నీరు, తడి నేలలో ఉంటుంది. వర్షాలు, వరదల సమయంలో దీని వ్యాప్తి ఎక్కువ. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. అలాగే రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసేవారికి త్వరగా సోకే వీలుందంటున్నారు.