తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ .. కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. .. దానికి సంబంధించిన ఏర్పాట్లను.. తెలంగాణ జాగృతి చూసుకుంటోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీకి సంబంధించిన నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఇప్పటికే తెలిసింది. అయితే తాజాగా కొత్త పార్టీకి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర ఆసక్తికరంగా మారాయి. తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టేందుకు కవిత, జాగృతి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు రావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరు ఇప్పుడు ఖాళీగా ఉందని.. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేయడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. అదే సమయంలో పాత పేరు, కొత్త జెండా, అజెండాతో తెలంగాణ ప్రజల ముందుకు వస్తానని చెప్పడంతో.. కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెడతారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చని వ్యాఖ్యలు చేసిన కవిత.. తమ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్‌ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టినా జెండాలో మాత్రం గులాబీ రంగు ఉండదని కవిత చెప్పినట్లు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నామని.. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా జాగృతి టీమ్ పని చేస్తుందని కవిత తెలిపారు. బిహార్ సిద్ధాంతాలు తమ పార్టీలో ఉండవని తేల్చి చెప్పారు. పార్టీ ఆవిర్భావం రోజున అమరవీరుల స్థూపం వద్దకు వెళ్తామని చెప్పారు. ఆరోజున స్టేజ్ పైన ఉద్యమ కారులు ఉంటారని తెలిపారు. డీఎస్పీ విశారదన్ మహరాజ్‌తో కలిసి తాము పనిచేస్తామని కవిత వెల్లడించారు. తమకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ధనిక పార్టీ అని ఆరోపించారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే దానిపైనా కవిత హింట్ ఇచ్చారు. సిద్దిపేట నియోజకవర్గంలో మహిళా రిజర్వేషన్లు వస్తే తప్పకుండా పోటీ చేస్తానని కవిత తేల్చి చెప్పారు. గజ్వేల్‌లో మహిళా రిజర్వేషన్ వచ్చినా ఆలోచిస్తానని తెలిపారు. నిజామాబాద్‌లో కూడా చాలా సీట్లు ఈ సారి మహిళా రిజర్వేషన్‌లోకి వస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్ కష్టపడితేనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. అలాగే జాగృతి కోసం తాము కష్టపడతామని కవిత వెల్లడించారు. ఆడబిడ్డకు ఓటేయడం అనేది ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. తాను భగవద్గీత చాలాసార్లు చదివానని.. ఇంకా చదువుతూనే ఉన్నట్లు చెప్పిన కవిత.. అందులో ఉన్న నీతి చాలా గొప్పదని.. యుద్ధం చేయాల్సిందేనని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ.. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014, 2018ల్లో వరుసగా అధికారంలోకి వచ్చింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2022లో టీఆర్ఎస్ పార్టీని కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరును వదులుకుంది. అయితే 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవానికి కారణం పార్టీ పేరు మార్పే అని.. ఇతర పార్టీలతోపాటు ఆ పార్టీ నేతలు కూడా బహిరంగంగానే చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు మాత్రం పార్టీ హైకమాండ్ నుంచి అలాంటి చర్యలు ఏవీ తీసుకోకపోవడం గమనార్హం. ఇలాంటి సమయంలోనే టీఆర్ఎస్ పార్టీ పేరును తన పార్టీకి పెట్టుకుంటే.. తెలంగాణ ఎమోషన్, సెంటిమెంట్‌ను తన వైపు తిప్పుకోవచ్చనే ఆలోచన కవిత చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న కవిత.. తెలంగాణ జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా జాగృతి పేరుతో పలు కార్యక్రమాలను చేపట్టిన కవిత.. ఆ తెలంగాణవాదాన్ని తాను విడిచిపెట్టలేదని పదే పదే చెబుతున్నారు. సహకరిస్తుందని అనిపిస్తుందని కవిత వ్యాఖ్యానించారు. ఎంత తెలివి ఉన్న వాడిని అయినా ఆపొచ్చు కానీ.. అదృష్టవంతుడిని మాత్రం ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. హార్డ్ వర్క్ చేయడంలో చంద్రబాబు సూపర్ అని.. పార్టీ నిర్మాణంలో టీడీపీ చాలా స్ట్రాంగ్ అని కొనియాడారు.