హైదరాబాద్‌ని ప్రపంచ పటంలో నిలిపింది చంద్రబాబే.. దాన్ని ఎవరూ చెరిపేయలేరు: హీరో శివాజీ మళ్లీ వేసేశారు

Wait 5 sec.

ఏంటీ.. అంటే అంత ఈజీ అనుకున్నారా? గుంతలు తీయాలా.. పిల్లర్లు వేయాలా.. లేపాలా.. వేల కిలోమీటర్లు రోడ్లు వేయాలా.. చాలాఉంది. విజనరీ లీడర్ చంద్రబాబుగారు హైదరాబాద్‌ని ప్రపంచ పటంలో నిలిపినట్టే.. అమరావతిని కూడా అద్భుతంగా నిర్మిస్తారని అన్నారు తెలుగుదేశం పార్టీ వీరవిధేయుడు, వివాదాస్పద నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ . అమరావతిని శాశ్వత రాజధానికి ప్రకటిస్తూ ఉభయ సభల్లో బిల్లు పాస్ కావడంతో ఆనందం వ్యక్తం చేసిన శివాజీ.. మరోసారి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకి హైదరాబాద్ రాజధాని.. ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి రాజధాని. ఈ సమయంలో మనం కృతజ్ణత చెప్పుకోవాల్సింది కొంతమంది అమరవీరులకి, రాజధాని కోసం ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితమే ఇది. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ తరమే కాకుండా రాబోయే తరాలు కూడా మీ పాదాలకి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ కృతజ్ణతతో ఉండాలి వీళ్లంతా. బావితరాలు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి.. మోడీ గారికి.. గారికి.. పవన్ కళ్యాణ్ గారికి.. కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు. తరతరాలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. నాది ఆంధ్రప్రదేశ్.. నా రాజధాని అమరావతి.. ఈ మాట ధైర్యంగా చెప్పే అవకాశం వచ్చింది. ప్రభుత్వాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. రాజకీయ స్వార్థం కోసం బావితరాలకు అన్యాయం చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రజల అవసరాలను గుర్తించాలి. చంద్రబాబు గారు హైదరాబాద్‌కి చేసిన సంస్కరణల వల్లే ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలబడింది. దాన్ని ఎవరూ తురిపేయలేరు. ఆరోగ్య శ్రీ అంటే రాజశేఖర్ గారు గుర్తొస్తారు. వాటిని ఎవరూ చెరిపేయలేరు. నేను ఏ రాజకీయ పార్టీని విమర్శించడం లేదు. పాలన గతి తప్పినప్పుడు జనం ఓట్లతోనే మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్‌కి శాశ్వత రాజధాని ఉండాలనేది ప్రతి ఆంధ్రుడు ఆశ. మేం కూడా జైతెలంగాణ అన్నాం.. ఎందుకుంటే అది వాళ్ల హక్కు. అమెరికాలో ఉన్న ఇండిపెండెన్స్ డే చేసుకుంటారు కదా.. ఇది కూడా అంతే. హైదరాబాద్‌లో ఉన్నంత మాత్రాన నేను ఆంధ్రుడ్ని కాకుండా పోతానా? నా మూలాలు నేను ఎలా మర్చిపోతాను. ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం. అమరావతి రాజధాని రావడం వల్ల చాలామంది ఉపయోగం ఉంటుంది. కేవలం బిల్డింగ్‌లు మాత్రమే కాదు. మొన్న నేను అమరావతి-దుబాయ్ గురించి ఓ మాట మాట్లాడాను. ముర్ఖులకి తెలియదు. నేను ఇప్పటికీ అదే చెప్తున్నా.. పెట్టుబడులు ఎలా వస్తాయంటే సేఫ్ ప్లేస్ చూసుకుంటారు. దుబాయ్ లాగే అమరావతికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచి నాయకుడు ఉన్నాడు.. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు. కంపెనీలు ఖచ్చితంగా వస్తాయి. వచ్చే పదేళ్లలో అమరావతి మొత్తం మారిపోతుంది. 1995 వరకూ హైదరాబాద్‌లో ఏమీ లేదు.. చంద్రబాబు గారు మొత్తం మార్చేశారు. అమరావతిని కూడా అలాగే మార్చేస్తారు. సింగపూర్‌లా మార్చేస్తారు. వాళ్లు చాలా డెవలప్‌మెంట్ చేస్తారు. వ్యతిరేకించే వాళ్లు ఏదో ఊహించుకుంటారు తప్పితే.. అదే జరగదు. రాజకీయ పార్టీ అధ్యక్షులు ఎవరూ వాళ్ల కుటుంబ ఆస్తుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టరు. కాబట్టి.. మీ ఇష్టా ఇష్టాలు ఇక్కడ పనికి రావు. ప్రజల ఇష్టానుసారంగానే చేయాలి.. లేదూ అంటే ఇంట్లోనే కూర్చోబెడతారు. బాబుగారి విజన్‌కి చాలామందికి వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతికి ఇప్పటివరకూ చంద్రబాబు గారు ఏం చేశారని చాలామంది కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నారు. అమరావతి అంటే అంత ఈజీనా? రెండు మూడేళ్లలో అయిపోతుందా? అంత తమాషానా? రెండు మూడు వేల కిలోమీటర్లు రోడ్లు వేయాలి.. ఐదేళ్ల పాటు స్మశానంలా వదిలేశారు. ఇప్పుడు దాన్నంతా ఇప్పుడు బాగు చేస్తున్నారు. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడేస్తున్నారు. చంద్రబాబుకి అక్కడ ఇల్లు లేదు అని అంటున్నారు. ఎన్ని ఇల్లులు ఉండాలి? మోడీ గారికి ఉందా? ఢిల్లీలో ఉంటున్నారు కదా.. ఉన్న ప్రతిచోటా ఇల్లు ఉండాలా? రాష్ట్రాలకి రాజధాని అవసరం లేదని అంటున్నారు. అది ఆయన (జగన్) అభిప్రాయం. అన్నీ రాజ్యాగంలో ఉండవు. అన్నీ రాజ్యాగంలో ఉంటే.. ఇన్ని వందల, వేల కోట్లు ఎలా సంపాదించలేరు. అతి తెలివితేటలు వద్దూ.. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. గేదెల్ని కాచేవాడు కూడా అంతా చూస్తున్నాడు. ఈరోజుకైనా పద్దతి మార్చుకోవాలి. మన ప్రయోజనాల కోసం ఆలోచించాలా? ప్రజల ప్రయోజనాలా? అని ఆలోచించాలి. ప్రభుత్వం ఉండాలీ.. ప్రతిపక్షం ఉండాలీ.. ప్రజల ఆలోచనల్ని ప్రభుత్వాల ముందు ఉంచాలి తప్పితే.. సొంత ప్రయోజనాలు కాదు. అమరావతిని కంప్లీట్ చేయాలంటే.. వెంటనే అవ్వదు.. గుంతలు తీయాలా.. పిల్లర్లు వేయాలా.. లేపాలా.. మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు ఇలా చాలా ఉన్నాయి. ఏది చేసిన పిల్లల కోసమే కదా.. పిల్లలు అంటే రేపటి తరమే కదా.. అమరావతి అంటే రేపటి తరమే కదా’ అంటూ అమరావతికి చంద్రబాబుకి మరోసారి జై కొట్టారు శివాజీ.