BSNL ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. 1 రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేట్, అపరిమిత కాల్స్!

Wait 5 sec.

: ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వీఐలు మార్కెట్ వాటా పరంగా ముందున్నాయి. ఆయా సంస్థలు 5G నెట్‌వర్క్ విస్తరిస్తూ దూసుకెళ్తున్నాయి. వాటి పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వేగం పెంచింది. 5జీ నెట్‌వర్క్ విస్తరణకు చర్యలు మొదలు పెట్టడంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరకే సూపర్ బెనిఫిట్స్‌తో రీఛార్జ్ ప్లాన్స్ కల్పిస్తోంది. కొత్త కస్టమర్లకు ఉచితంగానే సిమ్ కార్డు ఇవ్వడంతో పాటు అదనపు బెనిఫిట్స్ ఇస్తూ ఔరా అనిపిస్తోంది. ఈ క్రమంలో కస్టమర్లను విపరీతంగా మరి ఆ వివరాలు తెలుసుకుందాం. తమ కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ మరోసారి శుభవార్త చెప్పింది. గత ఏడాది 2025, ఆగస్టు 15వ తేదీ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా ప్లాన్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఫ్రీడమ్ ప్లాన్ పేరుతో తెచ్చిన ఈ ప్లాన్ ఒక్క రూపాయికే సిమ్ కార్డుతో పాటు 30 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటివి ఇచ్చి సంచలనం సృష్టించింది. ఇవ్వడంతో ప్రజలను ఆకర్షించింది. పెద్ద ఎత్తున ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను కొనుగోలు చేశారు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అందించడంతో చాలా మంది నిరాశ చెందారని చెప్పవచ్చు. ఆ తర్వాత దీపావళి, క్రిస్మస్ వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ ఈ ఫ్రీడమ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ప్రజల డిమాండ్ మేరకు ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ఇండియా ఓ పోస్ట్ చేసింది. 'ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్‌ మేరకు తిరిగి లాంచ్ చేస్తున్నాం. ఈసారి అస్సలు మిస్ కావద్దు.ఫ్రీడమ్ ప్లాన్ కేవలం రూ.1కే లభిస్తుంది. దీంతో ఉచితంగా సిమ్ కార్డు పొంది ఎంజాయ్ చేయండి. ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. వెంటనే మీ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ స్టోర్‌కు వెళ్లి కొత్త సిమ్ కార్డు పొందండి ' అని ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ఇండియా పోస్ట్ చేసింది. అయితే గతంలో లిమిటెడ్ టైమ్ మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంచగా ఈసారి ఎలాంటి గడువు తేదీని పేర్కొనకపోవడం గమనార్హం. , రోజుకు 2GB చొప్పున 4G డేటా వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు సైతం లభిస్తాయి. ఈ ఆఫర్ కొత్త కస్టమర్లకు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. కొత్త సిమ్ తీసుకోవాలనుకునే వారు ఒక్క రూపాయి చెల్లించాలి. నెల రోజుల వ్యాలిడిటీ ప్యాక్ ఉచితంగా లభిస్తుంది. ఫ్రీ డేటా, కాల్స్ లభిస్తాయి. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా కొత్త సిమ్ కొనాలనుకునే వారు సమీపంలోని రిటైలర్ లేదా బీఎస్ఎన్ఎల్ కామన్ సర్వీస్ కేంద్రానికి వెళ్లి పొందవచ్చు.