హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు హైదరాబాద్‌లో తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?

Wait 5 sec.

Gold Rate Today: పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో బంగారం ముడిపడిపోయింది. అలాగే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఒక మంచి సాధానంగానూ కొనసాగుతోంది. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీ ఉంటుంది. అందుకే వీటి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇరాన్ యుద్ధం జరుగుతున్నా రికార్డ్ గరిష్ఠాల నుంచి 17 శాతం మేర దిగివచ్చాయి. అయితే, మళ్లీ పరిస్థితులు తారుమారయ్యాయి. గత వారం క్రితం నుంచి బంగారం ధరలు పెరగడం మొదలైంది. దీంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో పసిడి రేట్లు పెరగడంతో కొంత మేర ఆందోళన నెలకొంది. అయితే, ఇప్పుడు పసిడి ప్రియులకు శుభవార్త లభించింది. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజూ తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 15 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ఔన్స్ 4660 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.21 శాతం మేర తగ్గి 72.81 డాలర్ల వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములపై రూ.270 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ.1,50,660 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు 10 గ్రాములకు రూ.250 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,38,100 వద్దకు దిగివచ్చింది. రూ.5 వేలు పెరిగిన వెండిగత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి రేటు మాత్రం ఈరోజు పెరిగింది. ఓవైపు బంగారం ధర తగ్గినా వెండి రేటు పెరగడం గమనార్హం. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో కిలో సిల్వర్ ధర రూ.2,60,000 వద్దకు ఎగబాకింది. పైన చెప్పిన బంగారం, వెండి ధరలు ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నం లోపు మారుతుంటాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు స్థానికంగా ఉండే ధరలను కొనుగోలు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.