పంచాయతీ కార్యదర్శులకు షాకింగ్ న్యూస్.. పేస్కేల్ తగ్గింపు

Wait 5 sec.

రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీవో 91 సవరిస్తూ.. పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ 5, గ్రేడ్ 4 నుంచి పీడీవో గ్రేడ్ -3కు ఇటీవల అప్ గ్రేడ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. వారి పేస్కేల్‌ను రూ.28,280కు పెంచింది. అయితే తాజాగా జీవో 91 సవరించిన ఏపీ ప్రభుత్వం.. పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.28280 నుంచి రూ. 25220 తగ్గిస్తూ జీవో 60 జారీ చేసింది. దీనిపై రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్నారు. జీవో 60ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రేడ్‌-4, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులను పీడీవో గ్రేడ్‌-3గా ఇటీవల అప్‌గ్రేడ్ చేశారు. అలాగే వారి పేస్కేల్‌ కూడా రూ.28,280కు పెంచారు. పంచాయతీల్లోనూ పట్టణ తరహా పరిపాలన, పౌర సేవలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 359 రూర్బన్‌ పంచాయతీలను ఎంపిక చేసింది. పదివేల మందికిపైగా జనాభా, ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం కలిగిన పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఎంపిక చేశారు. వీటికోసం డిప్యూటీ ఎంపీడీవో, సీనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించి, వారికి గెజిటెడ్ హోదా కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూర్బన్‌ పంచాయతీలలో కొత్తగా ప్రణాళిక విభాగం, ఇంజినీరింగ్, ప్రజారోగ్యం, రెవెన్యూ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. రోడ్లు, భవనాలు, కాలువల నిర్మాణం వంటి పనులను ఇంజనీరింగ్ విభాగం చేపట్టనుంది. ప్రజారోగ్య విభాగం కింద చెత్త సేకరణ, పారిశుద్ధ్యం వంటి పనులు ఉంటాయి. ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని ప్రణాళిక విభాగం, వనరుల సమీకరణలో రెవెన్యూ విభాగం పనిచేస్తాయి. పంచాయతీలలో ఈ విభాగాలలో పనిచేసే సిబ్బందిని వారి ఆసక్తి అనుగుణంగా సర్దుబాటు చేస్తారు. పునర్విభజన తర్వాత ఏపీలో రూర్బన్ పంచాయతీలు 359, గ్రేడ్ -1 పంచాయతీలు 3.082, గ్రేడ్ -2 పంచాయతీలు 3,163, గ్రేడ్ -3 పంచాయతీలు 6,747 ఉండనున్నాయి. పునర్విభజన నేపథ్యంలోనే గ్రేడ్ 4, గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ -3గా ప్రమోషన్లు కల్పించారు. అయితే ప్రమోషన్లు కల్పించినట్లే కల్పించి.. ఇలా పేస్కేల్ తగ్గించటం ఏమిటంటూ పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్నారు. జీవో 60 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.