ఇరాన్‌లో అమెరికా సాహసోపేతమైన ఆపరేషన్‌.. ఒకరిని కాపాడటానికి రూ.4,465 కోట్లు ఖర్చా?

Wait 5 sec.

అమెరికా ఎఫ్‌-15 యుద్ధ విమానాన్ని గతవారం ఇరాన్ కూల్చేయగా.. అందులో ఒక పైలట్‌, ఒక ఆయుధ వ్యవస్థ అధికారి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో పైలట్‌ను అమెరికా సైన్యం ముందు రక్షించగా.. ఆయుధ వ్యవస్థ అధికారి ఆఫీసర్‌ జాడ మాత్రం గల్లంతైందిచేపట్టిన సంగతి తెలిసిందే. కఠినమైన కొండల్లో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్‌ విజయవంతం కాగా.. శత్రు భూభాగం నుంచి తమ అధికారిని అమెరికా సురక్షితంగా తీసుకెళ్లింది. కూలిన అనంతరం ఇరాన్‌ బలగాలకు చిక్కకుండా అతడు పర్వతాలపైకి చేరి ఓ కొండ మధ్యలోని పగులులో దాక్కొన్నాడు. ఆ అధికారి ఆచూకీని సీఐఏ సాయంతో గుర్తించిన సైన్యం.. ‘సీల్‌ టీమ్‌ 6’ను ఆపరేషన్‌ కోసం రంగంలోకి దించింది. అయితే, ఈ ఆపరేషన్ కోసం దాదాపు అర బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4,645 కోట్లు ఖర్చయినట్టు అంచనా.అమెరికా మిషన్కూలిపోయిన ఎఫ్-15 యుద్ధ విమానం పైలట్లను రక్షించే ఈ ఆపరేషన్‌లో A-10 థండర్‌బోల్ట్ II జెట్‌లు, MC-130J కమాండో II విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, MQ-9 రీపర్ డ్రోన్‌లతో సహా అనేక అధునాతన సైనిక సామాగ్రిని ఉపయోగించారు. వీటిలో చాలా వరకు ఆపరేషన్‌ సమయంలో ధ్వంసమయ్యాయి. కొన్నింటిని శత్రువుకు టెక్నాలజీ చిక్కుండా అమెరికా సైన్యమే నాశనం చేసింది. ఇక, ఇరాన్ కూల్చేసిన ఎఫ్-15 యుద్ధ విమానం విలువ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ.929 కోట్లు).పైలట్, ఆయుధ వ్యవస్థ అధికారి ఉన్నారని భావించిన ప్రదేశానికి సి-130 హెర్క్యులస్ విమానాలు, హెచ్-60 హెలికాప్టర్లు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఇరాన్ భూభాగంలో చాలా లోపల అతడి సిగ్నల్‌ను నిఘా డ్రోన్‌లు పసిగట్టాయి. ఇవి ఆధికారి ఉన్న చోటును నిర్ధారించి, చుట్టూ ఉన్న ముప్పులను మ్యాప్ చేశాయి.ఆ తర్వాత, అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ బృందాన్ని దింపారు. గాయపడిన అధికారి దాక్కున్నాడని భావించిన ప్రదేశానికి ఇరాన్ దళాలు రాకుండా అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. ఆ అధికారికి 3 కిలోమీటర్ల పరిధిలో ఉండి, ముప్పుగా భావించిన ఇరాన్ సైనికులను నిలువరిస్తూ.. రెస్క్యూ బృందాన్ని రక్షించడానికి MQ-9 రీపర్ డ్రోన్‌లను కూడా ఉపయోగించారు. తమ సైనికుడ్ని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరుతుండగా.. లాక్‌హీడ్ మార్టిన్ సి-130 విమానాలలో కనీసం రెండింటిలో (ఒక్కొక్కటి 100 మిలియన్ డాలర్లు) సాంకేతికలోపం తలెత్తింది. దీంతో సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం శత్రువులకు చిక్కుండా అమెరికా దళాలు ఈ మిషన్‌లో రెండు సి-130 కార్గో విమానాలను ధ్వంసం చేశాయి. అలాగే, ఒక్కొక్కటి సుమారు 7.5 మిలియన్ డాలర్ల విలువైన కనీసం రెండు MH-6 లిటిల్ బర్డ్ హెలికాప్టర్లను ఒక ఫార్వర్డ్ బేస్ వద్ద పేల్చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.30 నుంచి 60 మిలియన్ డాలర్ల ఉండే కొన్ని MQ-9 రీపర్ డ్రోన్‌లను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. దీనిని అమెరికా మాత్రం ధ్రువీకరించలేదు. ఈ మిషన్‌లో పాల్గొన్న ‘వార్‌హగ్’‌గా పిలిచే ఎ-10 థండర్‌బోల్ట్ II విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ మీడియా నివేదించింది. కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత కూలిపోయిన 20 మిలియన్ డాలర్ల విమానం కూడా అదే మిషన్‌లో భాగమే. అయితే, అమెరికా మాత్రం ఇంకా నిర్దారించలేదు. దాని పైలట్ సురక్షితంగా బయటకు దూకేశాడు.ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావంఇరాన్‌తో యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చుచేస్తుండటంతో దాని ప్రభావం ప్రజలపై నేరుగా పడుతోంది. అమెజాన్ ఈ-కామర్స్ డెలివరీలపై ఫ్యూయర్ సర్‌ఛార్జ్, కొన్ని విమానయాన సంస్థలు చెక్-ఇన్ బ్యాగేజ్ ఫీజులను పెంచాయి. యుద్దం కారణంగా పెరిగిన ఇంధన ధరలను తట్టుకోడానికి ఈ చర్యలు తీసుకున్నాయి. ఎక్కడో యుద్ధం జరుగుతున్నా.. దాని భారం మాత్రం సామాన్యులే మోయాల్సి వస్తుంది. మరోవైపు, హర్మూజ్ జల సంధిని 48 గంటల్లోగా తెరవాలని, లేకుంటే వినాశనం తప్పదని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ గడువు మంగళవారం రాత్రి 8 గంటలతో ముగియనుండగా.. ఏం జరగబోతుందననే ఉత్కంఠ నెలకుంది.