ఏపీలో కొత్తగా 'సీ షోర్ హైవే'.. సముద్ర తీరం వెంబడి, పచ్చటి ప్రకృతి నడుమ ప్రయాణం.. కేంద్రానికి ప్రతిపాదనలు

Wait 5 sec.

సముద్ర తీరం పక్కనే నేషనల్ హైవేపై ప్రయాణిస్తుంటే ఎలా ఉంటుంది.. ఆ థ్రిల్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఏపీ ప్రభుత్వం సరికొత్తగా సముద్ర తీరం వెంట సీ షోర్ హైవేను ప్లాన్ చేసింది. కత్తిపూడి టు ఒంగోలు నేషనల్ హైవే-216 విస్తరణకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు 120 కిలోమీటర్ల పొడవున సీ షోర్ హైవే నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయి.వాస్తవానికి మచిలీపట్నం పోర్టు అవసరాల కోసం గతంలో నేషనల్ హైవే 216 నుంచి విస్తరిచాలని భావించారు. కానీ తాజాగా సీ షోర్ హైవే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒకవేళ నేషనల్ హైవే 216 నుం విస్తరించాలంటే భూసేకరణ, నిర్మాణం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అంటున్నారు. అదే ఈ సీ షోర్ హైవే అయితే ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. అందుకే మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ఈ ప్రతిపాదనను తీసుకురాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఓకే చెప్పి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.ఈ సీ షోర్ హైవే ప్రాజెక్టుతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, ఆక్వా ఉత్పత్తుల రవాణా, పర్యాటకంగా ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ హైవే మత్స్య, వ్యవసాయ, కొబ్బరి వంటి వాటి రవాణాకు కీలకం అవుతుంది. నేషనల్ హైవే 216ను అప్పటి వాహనాల రాకపోకలకు అనుగుణంగా నిర్మించారు. కానీ ఈ హైవేలో ఇప్పుడు రద్దీ పెరిగింది. ఈ హైవేతో ఆ రద్దీ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ఉప్పాడతో పాటుగా కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు రవాణా వేగవంతం అవుతుందని చెబుతున్నారు. వాస్తవానికి సముద్ర తీరం వెంట కొన్ని నిబంధనలు (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) అమల్లో ఉన్నాయి.. కానీ రోడ్లకు మాత్రం ఇబ్బంది లేదని చెబుతున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్టుకు ఇబ్బందులు ఉండవని, భూసేకరణ కూడా అవసరం లేదంటున్నారు. అయితే ఈ సీ షోర్ హైవేలో అవసరమైన చోట కొన్ని కాలువలు సముద్రంలో కలిసే ఆర్‌వోబీలు, ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంటుంది. కేంద్రానికి పంపించిన ఈ ప్రతిపాదనల్లో ఈ అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మచిలీపట్నం పోర్టును మరికొన్ని ప్రాంతాలకు అనుసంధానం చేయొచ్చంటున్నారు. అలాగే సీ షోర్ హైవే మచిలీపట్నం పోర్టును నిజాంపట్నం పోర్టును కనెక్ట్ చేస్తుంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలను అనుసంధానంతో పాటుగా బీచ్‌లకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ ప్రాంతాలు మంచి టూరిజ్ స్పాట్లుగా మారతాయంటున్నారు. హోటళ్లు, రిసార్టులు కూడా వస్తాయంటున్నారు.