పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా జనాల్ని గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ల విషయంలో జనాలు ఇబ్బందిపడుతుండగా.. కొద్దిరోజులుగా ఆ పరిస్థితి మారిపోతోంది. మెల్లిగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయ్యిందని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌లు, డెలివరీల మధ్య గ్యాప్ క్రమంగా తగ్గుతోందని తెలిపారు. గత రెండు రోజుల నుంచి పరిశీలిస్తే బుకింగ్‌ల కంటే డెలివరీలు ఎక్కువ అయ్యాయని చెబుతున్నారు. మార్చి రెండో వారంలో రోజుకు 5 లక్షల గ్యాస్ బుకింగ్‌లు ఉంటే.. డెలివరీలు బాగా ఆలస్యం అయ్యాయి. గ్యాస్ సిలిండర్ల బ్యాగ్‌లాగ్‌లు భారీగా ఉన్నాయి.. ఆ తర్వాత ప్రభుత్వం గ్యాస్ విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పడంతో జనాల్లో ఆందోళన తగ్గింది. గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తున్నాయి. శనివారం రోజు (ఏప్రిల్ 4న) 2,11,302మంది గ్యాస్‌ బుకింగ్ చేసుకుంటే.. 2,77,367 సిలిండర్లను డెలివరీలు చేశారు. ఆదివారం చూస్తే.. మొత్తం 2లక్షల 25వేల 824 గ్యాస్‌ బుకింగ్‌లు జరిగితే 2లక్షల 92వేల 247 డెలివరీలు జరిగాయి. ఈ లెక్కల్లో బ్యాక్‌లాగ్‌ డెలివరీలు (గతంలో డెలివరీ ఆగిపోయిన సిలిండర్లు) కూడా ఉన్నాయి. విశాఖకు నౌకలువిశాఖపట్నం తీరానికి ఇటీవల ఎల్‌పీజీ, చమురు నౌకలు చేరుకున్నాయి. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ గ్యాస్‌తో ‘బీడబ్ల్యూ బ్రిచ్‌’ అనే భారీ నౌక గత నెలలో విశాఖకు వచ్చింది. మరో రెండు నౌకలు కూడా విశాఖపట్నం వచ్చాయి. ఈ నౌకల నుంచి గ్యాస్‌ను, చమురును అన్‌లోడ్ చేశారు. అలాగే ఈ నెల 2, 5న కూడా రష్యా నుంచి, ముంద్రా పోర్టు నుంచి రెండు నౌకలు విశాఖపట్నం చేరుకున్నాయి. గత నెల ఈ నెల 1 నుంచి 25 వరకు ఇరాక్,ఖతార్, యూఏఈ, రష్యాతో పాటుగా దేశంలోని పలు పోర్టుల నుంచి పది చమురు నౌకలు విశాఖకు చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల కష్టాల నుంచి జనాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.