: పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొన్న సంగతి తెలిసిందే. మార్చి నెలలో భారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 11 శాతానికిపైగా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. . రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటివి గత వారం పుంజుకోగా.. హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్, ఎస్బీఐ వంటివి పతనం అయ్యాయి. అయితే ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. ఆరంభంలో స్వల్ప లాభాల్లోనే ప్రారంభమైనా తర్వాత మళ్లీ ఇంట్రాడేలో సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా కూడా పతనం అయింది. ఇప్పుడు మళ్లీ మధ్యాహ్నం సమయంలో పుంజుకున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఏప్రిల్ 6న ఒంటి గంటకు సెన్సెక్స్ 150 పాయింట్ల వరకు లాభంతో 73,470 స్థాయిలో ఉంది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకొని 22,770 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు కీలకంగా ఉన్నటువంటి హర్ముజ్ జలసంధిని ఇటీవల ఇరాన్ మూసివేయగా.. దానిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన గడువు నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో హర్ముజ్ తెరవకుంటే మరిన్ని భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో క్రూడాయిల్ ధరలో మరోసారి పెరిగి బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కు దాటింది. అయితే ఇక్కడ ఏప్రిల్ 6న సెషన్‌లో దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. కిందటి సెషన్‌లో ఈ స్టాక్ ధర రూ. 1350.50 వద్ద ముగియగా.. ఇవాళ ఆరంభంలో స్వల్ప లాభాల్లోనే రూ. 1359 వద్ద మొదలైంది. తర్వాత ఆ స్థాయి దాటి వెళ్లలేదు. ఇంకా భారీగా పతనమైంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో రిలయన్స్ షేరు 4.50 శాతం వరకు తగ్గి రూ. 1290 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 4 శాతం వరకు నష్టాల్లో ఉంది. రిలయన్స్ షేరు భారీ పతనంతో.. ఇవాళ ఒక్కరోజే కంపెనీ మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో రూ. 80 వేల కోట్లకుపైగా పడిపోయింది. అంటే ఇన్వెస్టర్ల సంపద ఈ మేర ఆవిరైపోయిందని చెప్పొచ్చు. కిందటి రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18.28 లక్షల కోట్లుగా ఉండేది. ఇవాళ ఇంట్రాడేలో ఇది రూ. 17.46 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. పడిపోయేందుకు చాలానే కారణాలు ఉన్నాయి. రిలయన్స్‌కు గుజరాత్ జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనరీ ఉంది. ఇది క్రూడాయిల్‌ను శుద్ధి చేసి.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎఫ్ వంటి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. . ఈ నేపథ్యంలోనే ఈ టాక్స్ వల్ల.. సంస్థ మార్జిన్లపై ప్రభావం పడుతుందని అమ్మకాల ఒత్తిడి నెలకొన్నట్లు తెలుస్తోంది. యుద్ధం ముగిసేంత వరకు ఈ ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గమనిక: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే.. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. అందుకే వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.