చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ రోజు చాలా ప్రతిష్టాత్మక మ్యాచ్. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడినా ఈ మ్యాచ్‌తో కమ్ బ్యాక్ ఇస్తారన్న నమ్మకం చాలా మంది అభిమానుల్లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటేనే సీఎస్కే స్క్వాడ్‌లో ఫుల్ ఫైర్ వైబ్స్ వస్తాయి. చావో రేవో అన్నట్టు ఆఖరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠగా సాగే ఈ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ స్పెషలిస్ట్ హిట్టర్‌ని బరిలోకి దింపుతోంది. ఫిట్‌నెస్ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన డేంజరస్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆడనున్నాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత నేరుగా సీఎస్కే క్యాంప్‌లోకి వచ్చిన బ్రెవిస్‌కు ఓ రెండు మ్యాచ్‌ల రెస్ట్ ఇచ్చారు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బ్రెవిస్ రాక సీఎస్కేకు బాగా కలిసొచ్చే అంశం. బౌండరీలు చిన్నగా ఉండే ఈ స్టేడియంలో బ్రెవిస్ లాంటి హిట్టర్ రాకతో చెన్నై భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరమైన ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌కి అందుబాటులోకి వస్తాడని అనుకున్నారు. కానీ.. మిస్టర్ కూల్ ఈ మ్యాచ్‌కి కూడా దూరమయ్యాడని తెలుస్తోంది. ఇక జట్టులో బ్రెవిస్ కాకుండా మరో రెండు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. స్పిన్ స్పెషలిస్ట్ అకేలా హోసన్‌తో పాటు జెమీ ఓవర్టన్‌ను కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. తొలి రెండు మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైన మ్యాట్ హెన్రీని డగౌట్‌కి పరిమితం చేసి ఆ ప్లేస్‌లో ఆల్‌రౌండర్ జెమీ ఓవర్టన్‌తో బౌలింగ్ చేయించే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్ గేమ్ ఛేంజర్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌తో అయినా కమ్ బ్యాక్ ఇవ్వాలని చెన్నై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్‌లో ఫర్వాలేదు అనిపిస్తున్న సీఎస్కే.. బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనారుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, కార్తీక్ శర్మ, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్/అకేలా హోసెన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ/జెమీ ఓవర్టన్.