ముంచేసిన ఎయిర్‌టెల్, ఎస్బీఐ, HDFC షేర్లు.. 3 రోజుల్లోనే రూ. 65 వేల కోట్లు లాస్.. రిలయన్స్, టీసీఎస్ అదుర్స్!

Wait 5 sec.

Reliance Share Price: పశ్చిమాసియాలో యుద్ధంపై ఇంకా సందగ్ధత వీడలేదు. ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేలోపే ఇరాన్ మరో ప్రకటన చేస్తోంది. ఇదే సమయంలో . ఇలా ఎటూ ఒక స్పష్టత రావట్లేదు. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లలోనూ తీవ్ర నష్టాలు వస్తున్నాయి. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో సూచీలు కుదేలవుతున్నాయి. మార్చి నెలలో భారీ స్థాయిలో సూచీలు పతనం కాగా.. ఏప్రిల్‌ నెలలోనూ అదే కంటిన్యూ అవుతోంది. విదేశీ పెట్టుబడిదారులు.. తమ పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో ఉపసంహరించుకుంటూనే ఉన్నారు.గత వారం చూస్తే 5 ట్రేడింగ్ సెషన్లలో మార్చి 31న మహవీర్ జయంతి, ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడ్ నేపథ్యంలో.. రెండు రోజులు సెలవులు రాగా.. మిగతా 3 రోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగింది. ఈ క్రమంలో 3 రోజుల్లోనూ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 3 రోజుల్లో 264 పాయింట్లు లేదా 0.35 శాతం తగ్గింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 106 పాయింట్లు లేదా 0.46 శాతం తగ్గింది. ఈ క్రమంలోనే మార్కెట్ విలువ పరంగా టాప్- 10 కంపెనీల్లో.. 6 కంపెనీల విలువే ఏకంగా రూ. 65 వేల కోట్ల మేర తగ్గింది. అంటే ఈ మేరకు ఇన్వెస్టర్లు నష్టపోయారన్నమాట. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను.. మదుపరుల సంపదగా పరిగణిస్తుంటారు. ఇక్కడ భారతీ ఎయిర్‌‌టెల్ అత్యధికంగా ప్రభావితమైంది. గత వారంలో ఎయిర్‌టెల్ ఎం- క్యాప్ రూ. 29,993.07 కోట్లు తగ్గడంతో మొత్తం మార్కెట్ విలువ రూ. 10.20 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12,845 కోట్లు తగ్గగా ఇప్పుడు రూ. 8.70 లక్షల కోట్ల వద్ద ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఎం- క్యాప్ రూ. 11,169 కోట్లు తగ్గి రూ. 5.14 లక్షల కోట్లకు దిగొచ్చింది. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,822 కోట్లు తగ్గగా రూ. 11.56 లక్షల కోట్లకు చేరుకుంది. హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ విలువ రూ. 2,349 కోట్లు తగ్గగా ఇప్పుడు రూ. 4.85 లక్షల కోట్లుగా ఉంది. చివరగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారంలో రూ. 553.8 కోట్లు తగ్గి రూ. 9.41 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. ఐటీ కంపెనీలు కాస్త రాణించాయి. భారత అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మార్కెట్ విలువ గత వారం రూ. 22,359 కోట్లు పెరగడంతో రూ. 8.87 లక్షల కోట్లుగా ఎం- క్యాప్ ఉంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ. 12,374 కోట్లు పెరిగి రూ. 5.27 లక్షల కోట్లుగా ఉంది. ఎల్ అండ్ టీ ఎం క్యాప్ రూ. 6,575 కోట్లు పెరిగి రూ. 4.97 లక్షల కోట్ల వద్ద ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 3,518 కోట్లు పెరిగి రూ. 18.28 లక్షల కోట్ల వద్ద ఉంది.