Jio Recharge: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ యూజర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. 28 రోజుల వ్యాలిడిటీను తొలగించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సరికొత్త క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీని అందిస్తోంది. రూ.339 రీఛార్జితో నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ లాంచ్ చేసినట్లు తెలిపింది. (నెలలో ఉన్న రోజులతో సంబంధం లేకుండానే) రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా తమ యూజర్లు అందరి కోసం ఈ కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీతో మంచి డేటా, అదనపు టాక్ టైమ్ కావాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ సరైన ఎంపికగా చెబుతున్నారు. రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.339గా నిర్ణయించారు. ఈ ప్లాన్ ద్వారా క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభికస్తాయి. వీటితో పాటు అదనంగా జియో టీవీ, జియో టీవీ ఏఐ క్లౌడ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. అయితే, ఈ ప్లాన్ లో ఇతర ఓటీటీ సదుపాయాలను జియో కల్పించకపోవడం గమనార్హం. మరోవైపు.. దాదాపు ఇవే బెనిఫిట్స్‌తో రూ.319 రీఛార్జ్ ప్లాన్ ను జియో అందిస్తోంది. అయితే, రూ.339 కొత్త ప్లాన్ ద్వారా అదనంగా రూ.14.95 టాక్ టైమ్ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ టాక్ టైమ్ ద్వారా అంతర్జాతీయ కాల్స్, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆప్ నేత రాఘవ్ చద్దా పార్లమెంట్ వేదికగా రీఛార్జ్ ప్లాన్ల వ్యాలిడిటీని లేవనెత్తారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని, నెల రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. క్యాలెండర్ మంత్ రీఛార్జ్ ప్లాన్లు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపింది. దీంతో దేశంలోని టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వీఐ సహా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త రీఛార్జ్ ప్లాన్లు లాంచ్ చేస్తున్నాయి. అదనపు బెనిఫిట్స్, టాక్ టైమ్, డేటా వంటివి కల్పిస్తూ కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే రిలయన్స్ జియో ప్రస్తుతం ఈ ప్లాన్ లాంచ్ చేసిందని టెలికాం రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.