ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. పార్లమెంట్ ఆమోదం అనంతరం అమరావతి బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. ఈ బిల్లును పరిశీలించిన అనంతరం.. న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలోని సబ్ సెక్షన్ 2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 2, 2024 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు.ఏపీ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లును కేంద్రం ఇటీవల పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టగా.. ఉభయసభలు ఆమోదం తెలిపాయి. సుమారు ఐదు గంటలు లోక్‌సభ, రాజ్యసభల్లో అమరావతి బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండానే అమరావతికి బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. దీంతో లోక్‌సభ సచివాలయం అమరావతి బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపించగా.. రాష్ట్రపతి సోమవారం రోజున అమరావతి బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో అమరావతి బిల్లు చట్టరూపం దాల్చింది.