రాజధాని అమరావతిలో నిర్మించిన ఓ టోల్ గేట్ కారణంగా వెంకటపాలెం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామంలోకి వెళ్లడానికి కూడా టోల్ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రోజున కొంతమంది గ్రామస్థులు వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తమ ఊరిలోకి వెళ్లే మార్గాన్ని తెరవాలని కోరారు. అలాగే బైపాస్ మీద ప్రయాణించేందుకు రాజధాని గ్రామాల ప్రజలకు ప్రత్యేక పాసులు జారీ చేయాలని వెంకటపాలెం గ్రామస్థులు నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా అధికారులను కోరారు. వెంకటపాలెం గ్రామస్థుల సమస్యలపై స్పందించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు.. వెంకటపాలెం గ్రామంలోకి వెళ్లే మార్గాన్ని తెరిచినట్లు వారికి వివరించారు. అలాగే త్వరలోనే వెంకటపాలెం టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే వారికి ప్రత్యేకంగా లోకల్ పాసులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విజయవాడలో కొత్తగా రెండు టోల్ ప్లాజాలు అందుబాటులోకి వచ్చాయి. వెదురుపావులూరు, వెంకటపాలెం టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ వసూలు ప్రారంభమైంది. మార్గంలో ఎన్‌హెచ్ఏఐ ఏర్పాటు చేశారు. ఈ టోల్ ప్లాజా అందుబాటులోకి రావటంతో కాజ టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజులు తగ్గాయి. అయితే వెంకటపాలెం టోల్ ప్లాజా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. తమ ఊరిలోకి వాహనాలతో ప్రవేశించాలన్నా కూడా టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ సమస్యలను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు లోకల్ పాసులు జారీ చేయాలని కోరారు. ఈ వినతులపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సానుకూలంగా స్పందించటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.