Gold Rate Today: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న ప్రకటనలు వెలువడినప్పుడు, లేదా యుద్ధం నుంచి ఉపశమనం లభిస్తుందన్న సంకేతాలతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఇక ఇరాన్ దాడులు పెంచుతోన్న సంకేతాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలా బులియన్ మార్కెట్ పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే, గత వారం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలతో కొనుగోలుదారులు బెంబేలిత్తిపోయారు. పసిడి ధర మరింత పెరుగుతుందనే ఆందోళనలు నెలకొన్న వేళ భారీ ఊరట లభించింది. ఇవాళ గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఆ ప్రభావం దేశీయంగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల ఎంత ఉందో తెలుసుకుందాం. 57 డాలర్లు తగ్గిన బంగారంఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 57 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4618 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.13 శాతం మేర పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు 72 డాలర్ల వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్‌లో బంగారం ధరలుఇవాళ 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఎలాంటి మార్పు లేకుండా రూ. 1,50,930 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 1,38,350 వద్ద అమ్ముడవుతోంది. స్థిరంగానే వెండి ధరహైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి రేటు సైతం స్థిరంగానే ఉంది. గత మూడు రోజుల నుంచి వెండి రేటు మారలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,55,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రోజు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నం లోపే మారిపోతుంటాయి. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు స్థానికంగా జువెలరీల్లో ఉడే ధరలను తెలుసుకోవడం మంచిది.