హ్యుందాయ్ బంపరాఫర్.. కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంతో ఫుల్ లిస్ట్ ఇదిగో..

Wait 5 sec.

i20 Discounts in April: ఇటీవలి కాలంలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అవసరాలు అలా పెరిగిపోవడమో లేదా.. కార్ల ధరలు తగ్గడమో.. ఆదాయం పెరగడమో.. ఇలా ఏదైనా కారణం కావొచ్చు. కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపైకి వచ్చే కార్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే గతేడాది కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీని భారీగా తగ్గించింది. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించగా.. ఇంకా అదనంగా సెస్ కూడా తొలగించింది. ఈ క్రమంలో వెంటనే కార్ల తయారీ కంపెనీలు ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని కస్టమర్లకు బదిలీ చేశాయి. దీనికి అదనంగా ఇతర ఆఫర్లను కూడా అందించాయి. దీంతో 2025 సెప్టెంబర్- అక్టోబరులో సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రికార్డులన్నీ బద్దలు కొట్టాయి. . ఇంకా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. పోటాపోటీగా కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తుండగా.. ఇదే సమయంలో పాత మోడల్స్‌ను వేగంగా విక్రయించేందుకు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. సాధారణంగా ఇయర్ ఎండ్ వేళ ఇలా ఎక్కువగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు ఏప్రిల్ నెలకుగానూ తన వేర్వేరు మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 1.10 లక్షల వరకు తగ్గింపులు ఇస్తుండటం విశేషం. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఈవీ, SUV ఇలా అన్ని రకాల వాహన శ్రేణిలపై డిస్కౌంట్లు ప్రకటించింది. కారు మోడల్, వేరియంట్, ఎక్స్చేంజ్ ఎలిజిబులిటీని బట్టి డిస్కౌంట్లలో మార్పులు ఉంటాయి. వీటిల్లో క్యాష్ డిస్కౌంట్ సహా ఎక్స్చేంజ్ బోనస్, అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్, స్క్రాపేజ్ సపోర్ట్, రూరల్ ఇన్సెంటివ్స్, కార్పొరేట్ బెనిఫిట్స్ ఇలా పలు రూపాల్లో తగ్గింపులు అందిస్తోంది. ఓల్డర్ స్టాక్ హ్యుందాయ్ వెర్నా ఐవీటీ ట్రిమ్స్‌పై అత్యధికంగా రూ. 1.10 లక్షల మేర తగ్గింపు ఉంది. మిగతా వాటిల్లో చూస్తే హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఐ10 నియోస్ హైయర్ ట్రిమ్స్‌పై రూ. 68 వేల వరకు తగ్గింపు ప్రయోజనాల్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ ఆరాపై డిస్కౌంట్ రూ. 20 వేల వరకు ఉంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఐ20పై రూ. 58 వేల వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది. SUV మోడల్ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై రూ. 43 వేలు ఆఫర్ ఇస్తుండగా.. కొత్త ట్రిమ్స్‌పై డిస్కౌంట్ కాస్త తక్కువగా ఉంది. క్రెటా, ఎన్‌లైన్ వేరియంట్లపై రూ. 55 వేల వరకు.. క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌పై రూ. 1 లక్ష వరకు తగ్గింపు ప్రయోజనాల్ని కల్పిస్తోంది.