అన్షుల్ కాంబోజ్ ఆ ఒక్క నో బాల్ వేయకుండా ఉండాల్సింది.. అదే సీఎస్కే ఓటమికి కారణం!

Wait 5 sec.

చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆఖరి ఓవర్లలో ఆ సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం మొత్తాన్ని దద్దరిల్లించారు. అయితే, ఆర్సీబీ విజయానికి టర్నింగ్ పాయింట్ మాత్రం సీఎస్కే చేసిన ఓ మిస్టేక్. ఆ ఒక్క మిస్టేకే చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో 18వ ఓవర్‌‌ని బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి బంతి ఫోర్ వెళ్లినా ఆ తర్వాత చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సీఎస్కే ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం అరక్షణం కూడా లేకుండా పోయింది. బౌల్డ్ అయిన బంతి నో బాల్ కావడంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దం అయింది. ఆ తర్వాత నుంచి టిమ్ డేవిడ్ సృష్టించిన విధ్వంసానికి స్టేడియం మొత్తం దద్దరిల్లింది. నో బాల్‌కి అవుటయ్యే సమయానికి టిమ్ డేవిడ్ 15 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇక ఫ్రీ హిట్ నుంచి ఊచకోత మొదలుపెట్టాడు. ఫ్రీ హిట్ బంతికి సిక్సర్ బాదిన టిమ్ డేవిడ్.. ఆఖరి బంతిని సింగిల్‌గా తీసి స్ట్రయికింగ్ ఉంచుకున్నాడు. జెమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, ఒక బౌండరీతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. దాంతో కేవలం 25 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 70 పరుగులు బాదాడు. దాంతో ఆర్సీబీ స్కోర్ 250కు చేరుకుంది. టిమ్ డేవిడ్ నో బాల్‌కి అవుటై తర్వాత పది బంతులు ఆడి 42 పరుగులు బాదాడు. అదే నో బాల్ కాకుంటా ఉండుంటే ఆర్సీబీకి ఇంత భారీ స్కోర్ దక్కేది కాదు. అంత భారీ స్కోర్ చేసినా సీఎస్కే కూడా ఆఖరి వరకూ పోరాడింది. టాప్ ఆర్డర్ కుప్పకూలినా మిడిలార్డర్ మ్యాచ్‌ని అంత దూరం తీసుకురావడం గొప్ప విషయమే. సర్ఫరాజ్ ఖాన్ 50, ప్రశాంత్ వీర్ 43, జెమీ ఓవర్టన్ 37 పరుగులు చేయడంతో సీఎస్కే 207 పరుగులు చేయగలిగింది. చిన్నస్వామి స్టేడియంలో వరుసగా రెండు విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలవగా.. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిన సీఎస్కే పదో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ తన తర్వాత మ్యాచ్‌ని ఏప్రిల్ 10వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌ జట్టుత ఆడనుండగా.. సీఎస్కే ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.