2030 నాటికి 25 లక్షల ఉద్యోగాలు.. హైదరాబాద్ సహా ఈ సిటిల్లోనే అధికం.. 2 రంగాలపై కీలక రిపోర్ట్

Wait 5 sec.

New Jobs: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్ధాలు, భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు చాలా రంగాలు కుదేలయ్యేలా చేస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాల్లో భారీగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రముఖ ఉద్యోగ కన్సల్టెన్సీ సంస్థ అడెకో ఇండియా అంచనా వేసింది. 2030 నాటికి 20 నుంచి 25 లక్షల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపింది.అయితే, కార్మిక శక్తిలో 30-35 సాతం మందికి నైపుణ్యాల పునఃసమీక్ష అవసరమని తెలిపింది. హాస్పిటల్స్, ఆయుష్, వృద్ధుల సంరక్షణ, ఫార్మా, డయాగ్నొస్టిక్స్, లైఫ్ సైనెస్స్, టెలిమెడిసిన్, క్లినికల్ పరిశోధన, పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ వంటి కీలక రంగాల్లో ఈ నియామకాలు ఉంటాయని, ఎక్కువగా స్పెషలైజెషన్, టెక్నాలజీ స్కిల్స్ ఉన్న వారికి అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపింది. 100 మందికి పైగా క్లయింట్ల నుంచి సేకరించిన వివరాలతో ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు అడెకో ఇండియా తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాల్లో వృద్ధి ఆర్థిక ప్రాబల్యంతో ముడిపడి ఉంటుందని నివేదిక తెలిపింది. ఇది 2022లో జీడీపిలో 3.3 శాతంగా ఉందని, క్లినికల్ పరిశోధనా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య స్వీకరణ, ఫార్మా వృద్ధి , తయారీని ప్రపంచ వ్యాప్తంగా నిరంతరం ఔట్ సోర్సింగ్ చేయడం వంటి వాటి మద్దతుతో వచ్చే 5 ఏళ్లలో 5 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. , వీటికి గిరాకీలో 20- 25 శాతం పెరుగుదల ఉంటుందని నివేదిక తెలిపింది. జనరిక్స్, స్పెషాలిటీ థెరపీలు, బయోలాజిక్స్ వైపు కీలక మార్పులు జరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా అధునాతన ఆర్ అండ్ డీ, రెగ్యులేటరీ ఉద్యోగాల కోసం నియామకాలు 30 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి ప్రాంతాల్లోనే 65- 70 శాతం వరకు నియామకాలు ఉంటాయని పేర్కొంది. హాస్పిటల్ నెట్ వర్క్స్, తయారీ క్లస్టర్లు, వికేంద్రీకృత డెలివరీ నమూనాల విస్తరణతో పుణె, అహ్మదాబాదా, కోయంబత్తూర్ వంటి నగరాల్లోనూ ఈ నియామకాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాలు అధికంగా విస్తరించి ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లో నియామకాలు ఎక్కువగా ఉంటాయని తెలపింది.