Google Data Center Vizag: ఏపీకి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. ఏప్రిల్ 28న శంకుస్థాపన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.చేపట్టారు. తాజాగా శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అధికారికంగా పనులను ప్రారంభించనున్నారు. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ పాల్గొంటారు. మొత్తం15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యంతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నెలకొల్పుతున్నారు. మరోవైపు గూగుల్‌ అనుబంధ సంస్థ అయిన రైడెన్‌ ఇన్ఫోటెక్‌, అదానీ ఇన్‌ఫ్రా భాగస్వామ్యంతో చేపడుతున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భూములను కూడా కేటాయించింది. మొత్తం మూడు చోట్ల 601.4 ఎకరాలను కేటాయించింది. తర్లువాడలో 266.6 ఎకరాలు, రాంబిల్లిలో 174.8 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు కలిపి మొత్తం 601.4 ఎకరాలను గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించింది. 2028 జులై నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ నెలాఖరులో డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే తర్లువాడలో జంగల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది. తర్లువాడలో సర్వేనంబర్ ఒకటిలోని భూములను గూగుల్ సంస్థకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ భూముల రైతులకు ఇప్పటికే నష్ట పరిహారం కూడా అందజేసింది.ఆ భూములలో జీడి మామిడి, మామిడి వంటి తోటలతో పాటుగా ఇతర చెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తొలగించే జంగల్ క్లియరెన్స్ పనులను ఏపీఐఐసీకి అప్పగించింది. ఏపీఐఐసీ సంస్థ ఓ కాంట్రాక్టర్‌కు ల్యాండ్ స్కేపింగ్ పనులు అప్పగించగా.. ఆ సంస్థ జంగల్ క్లియరెన్స్ పనులను మెజారిటీ శాతం పూర్తి చేసింది. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆలోగా చదును చేసే పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పనులు చేపడుతున్నారు.