రైలు ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే అమృత్ భారత్ రైళ్లను తీసుకువచ్చింది. ఇప్పటికే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 1.0, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 2.0 వెర్షన్లు, అందుబాటులోకి రాగా.. త్వరలోనే .0 ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రైల్వే శాఖ మంత్రి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 3.0 శాంపిల్ కోచ్‌ను న్యూఢిల్లీలో శనివారం పరిశీలించారు. ఈ వీడియోను ఎక్స్ ద్వారా షేర్ చేశారు రైల్వే మంత్రి. ప్రయాణీకుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, కొత్త డిజైన్లు, మెరుగైన టాయిలెట్ మోడల్స్ అభివృద్ధి చేసిందని రైల్వే మంత్రి తెలిపారు. ఒక బోగిని అప్ గ్రేడ్ చేసి.. రూపొందించిన శాంపిల్ కోచ్‌ను పరిశీలించినట్లు ట్వీట్ చేశారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 3.0 వెర్షన్‌లో ఏసీ కోచ్‌లు, కొత్త ఇంటీరియర్ డిజైన్‌ ఉంటుంది. అలాగే అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇందులో నాన్-ఏసీ కోచ్‌లతో పాటు ఏసీ కోచ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 3.0 కోసం ప్రతిపాదించిన ఇంటీరియర్ డిజైన్‌లు, కలర్ స్కీమ్‌లతో కూడిన నమూనా కోచ్‌లను శనివారం అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న అమృత్ భారత్ రైలు సర్వీసుల కంటే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 3.0 రూపకల్పనలో భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం అమృత్ భారత్ రైళ్లల్లో కేవలం జనరల్, స్లీపర్ క్లాస్ మాత్రమే ఉన్నాయి. అయితే అమృత్ భారత్ 3.0 వెర్షన్‌లో ఏసీ కోచ్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అమృత్ భారత్ 1.0, 2.0 రైళ్ల నిర్వహణ అనుభవంతో వీటిని రూపొందిస్తున్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 3.0 రైళ్లల్లో నాన్ ఏసీ కోచ్‌లతో పాటు ఏసీ కోచ్‌లు ఉంటాయి. అలాగే ఈ రైళ్లు గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రైళ్ల తయారీ పూర్తయిన అనంతరం.. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌కు అధికారులు పంపిస్తారు. ట్రయల్స్, టెస్టులు పూర్తి అయిన తర్వాత అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. రైలు ప్రయాణికుల సౌకర్యం కోసం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో అధునాతన సౌకర్యాలతో భారతీయ రైల్వే.. సర్వీసులు అందుబాటులోకి తెస్తోంది.