SRHకి తలనొప్పిగా మారిన ఆ బౌలర్‌ని పక్కనబెడతారా? ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11 ఇదే!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ హోం గ్రౌండ్ ఉప్పల్‌లో తొలిసారి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్‌హెచ్ ఒక దాంట్లో ఓడి.. మరో దాంట్లో గెలిచింది. బ్యాటింగ్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్న జట్టు బౌలింగ్‌లోనే తేలిపోతోంది. 200కు పైగా స్కోర్ చేసినా గెలుస్తామో? లేదో? అన్న భయం జట్టుకు పట్టుకుంది. దాంతో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఆసక్తికరంగా మారింది. సన్‌రైజర్స్ జట్టులో విదేశీ బౌలర్ అయిన ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాడు. స్పిన్, స్వింగ్ పిచ్‌ల మీదే భారీగా పరుగులు సమర్పించుకున్న పైన్ ఇప్పుడు ఉప్పల్‌లోని ఫ్లాట్ పిచ్‌పై ఇంకేరకంగా రన్స్ లీక్ చేస్తాడోనన్న టెన్షన్‌లో టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కూడా ఉన్నారు. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండటం లక్నోలో అరివీర భయంకర బ్యాటర్లు ఉండటంతో సన్‌రైజర్స్ అతన్ని ఆడించాలా? లేదా? అని ఆలోచిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బౌలర్ బ్రైడన్ కార్స్‌ను లక్నోపై బరిలోకి దించాలని చూస్తున్నారు. అయితే బౌలింగ్‌లో రాణించడంతో పాటు అవసరమైతే బ్యాట్‌తో పరుగులు రాబట్టగలడు. దాంతో పైన్‌కు రెస్ట్ ఇచ్చి బ్రైడన్ కార్స్‌ను ప్లేయింగ్ 11లో ఉంచితే సరిపోతుందని అందరూ అనుకుంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ పైన్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఫర్వాలేదు అనిపించాడు. ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులు ఇచ్చినా రెండు వికెట్లు తీసుకున్నాడు. దాంతో పైన్‌నే ఆడిస్తారా? లేక మార్పులు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్/ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ / డేవిడ్ పైన్, ఈషాన్ మలింగ.