నేను ఫస్ట్ టైమ్ మా ఆయన ఏడవటం చూసింది అప్పుడే.. రాధ కామెంట్స్

Wait 5 sec.

బిగ్‌బాస్, సీరియల్ సెలబ్రెటీలతో కపుల్స్ షోగా ప్లాన్ చేసిన 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఆడియన్స్‌ని ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తుంది. యాంకర్ శ్రీముఖి హోస్టుగా, అనిల్ రావిపూడి, లయ, రాధలు జడ్జీలుగా ఉన్న ఈ షోలో మొత్తం 10 జంటలు పార్టిసిపేట్ చేశాయి. వీరిని ఒక విల్లాలో ఉంచి రకరకాల టాస్కులు ఇస్తూ వాళ్ల ఎమోషన్స్‌ని ఆడియన్స్‌కి చూపిస్తున్నారు.అయితే బిగ్‌బాస్‌ని చూసినట్లుగా ఈ షోని ఆడియన్స్ చూడటం లేదు. టీఆర్పీ విషయంలో అయితే దారుణంగా ఉంది. దీంతో కొత్త కొత్తగా ఏదేదో ట్రై చేస్తున్నారు. ఇక వీకెండ్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వదిలారు. ఇందులో నటరాజ్ మాస్టర్-నీతూ జోడీకి శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. సడెన్‌గా ఇక్కడికి మీ అమ్మాయి వస్తే ఎలా రియాక్ట్ అవుతారనేదే మీకు ఇస్తున్న సిట్యూవేషన్.. అని చెప్పింది.దీంతో నటరాజ్ మాస్టర్ యాక్టింగ్ ఇరగదీశారు. లోపల ఎక్కడో చిన్న లోటు ఉంది అది మన పాప.. అమ్మా నా బేబీ వచ్చిందమ్మా.. డాడీని మిస్ అయ్యావా.. అని ఏకపాత్రాభినయం చేస్తుంటే నటరాజ్ నువ్వు ఊహించుకుంటున్నావ్.. పాప రాలేదని నీతూ చెప్పింది. డాడీ నా లవ్యూ అంటావ్ కదమ్మా.. ఒక్కసారి చెప్పమ్మా మమ్మీకి ఇనిపించేటట్టు చెప్పు.. అంటూ నటరాజ్ ఎమోషన్ పండించారు. ఇక ఈ సీన్ చూస్తూ అందరూ భావోద్వేగానికి గురయ్యారు.మా ఆయన తొలిసారి ఏడవడం చూశాముఖ్యంగా రాధ అయితే చూస్తునంత సేపు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవెన్ మా లైఫ్‌లో కూడా.. కార్తీకకి పెళ్లి అయిన తర్వాత నేను ఫస్ట్ టైమ్ మా ఆయన ఏడవటం చూశానని చెప్తూ రాధ వెక్కి వెక్కి ఏడ్చారు. రాధకి ఇద్దరు కూతుళ్లు ఉన్న సంగతి తెలిసిందే. మొదటి కూతురు కార్తీక హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. జోష్, రంగం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమెకి 2023లో వివాహం జరిగింది.ఈ పెళ్లికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకి చెందిన ప్రముఖ సెలబ్రెటీలు హాజరయ్యారు. రోహిత్ అనే ఒక వ్యాపారవేత్తని కార్తీక పెళ్లి చేసుకుంది. ఇక రాధ రెండో కూతురు తులసి.. కడలి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది. మణిరత్నం ఈ సినిమాని డైరెక్ట్ చేయగా తమిళ హీరో కార్తీక్ కుమారుడు గౌతమ్ ఇందులో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. ఆ తర్వాత యాన్ అనే మరో మూవీలో కూడా నటించింది. ఇక రాధ అయితే స్టార్ మాలో పలు టీవీ షోలకి జడ్జీగా చేస్తూ బిజీగా ఉన్నారు.