EPF Interest Rate: ఉద్యోగలు జీతం నుంచి ప్రతి నెలా ప్రావిడెండ్ ఫండ్ కోసం కొంత డబ్బు ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులకు ప్రతి ఏటా వడ్డీ చెల్లిస్తుంది. అయితే, లోక్‌సభలో ఎంపీ విజయ్ వసంత్ అడిగిన ఓ ప్రశ్న కోట్లాది ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. ఈఅని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇచ్చారు. వడ్డీ రేటు పెంపు అనేది కేవలం కోరిక మీద కాకుండా పక్కా లెక్కలతో ఉంటుందని స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుత వడ్డీ రేటుతో 1990లలో పీఎఫ్ వడ్డీ రేట్లు పోల్చి చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. పదేళ్ల పాటు ఏకంగా 12 శాతం వడ్డీ రేటు కల్పించారు. కానీ ఇప్పుడు 8.25 శాతం మాత్రమే వడ్డీ రేటు కల్పిస్తున్నారు. వడ్డీ ఎందుకు పెంచడం లేదు అనే ప్రశ్న ఎదురైనప్పుడు ప్రభుత్వం ఓ స్పష్టమైన లాజిక్ చూపిస్తోంది. 'వడ్డీ రేటు ఈపీఎఫ్ కార్పస్ ద్వారా వచ్చే వాస్తవ ఆదాయంపై ఆధారపడుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటును సిఫార్సు చేస్తుంది' అని కేంద్ర మంత్రి లోక్‌సభలో వివరణ ఇచ్చారు. అంటే పీఎఫ్ సంస్థ షేర్ మార్కెట్లో లేదా బాండ్లలో పెట్టిన పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి వడ్డీ రేటును నిర్ణయిస్తారు.ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ.. 10 శాతానికి పెంచాలని కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కానీ తమకు కార్మిక సంఘాల నుంచి అధికారిక విజ్ఞప్తులు రాలేదని కేంద్ర మంత్రి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఇస్తోన్న 8.25 శాతం వడ్డీ రేటు ఆర్థిక వ్యవస్థ మారుతున్న తీరును బట్టి నిర్ణయించినట్లు చెప్పారు. నిధుల భవిష్యత్తు, స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేందుకు ఇష్టానుసారంగా వడ్డీ పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.ఒకప్పుడు 12 శాతం వడ్డీ రేటు ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 8 శాతానికి పైగా వడ్డీ రావడం కూడా ఇతర పెట్టుబడుల కంటే మెరుగైనదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు పీఎఫ్ మీద మాత్రమే . అందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ క్రమంలో స్వతంత్ర భారత్‌లో పీఎఫ్ వడ్డీ రేట్లు ఎప్పుడు ఎలా ఉండోవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1977-78 వరకు పీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉండగా విత్ డ్రా చేయని వారికి 0.50 శాతం బోనస్ ఇచ్చే వారు1984-85 మధ్య పీఎఫ్ వడ్డీ 9.90 శాతంగా ఉండేది. 1986- 87 మధ్య పీఎఫ్ వడ్డీ రేటు ఏకంగా 11 శాతానికి చేరింది. 1989 నుంచి 200 మధ్య పీఎఫ్ వడ్డీ రేటు 12 శాతంగా ఉంది. చరిత్రలోనే అత్యధిక స్థాయి ఇదే. 2001 నుంచి 02 మధ్య పీఎఫ్ వడ్డీ రేటును 9.50 శాతానికి తగ్గించారు. మార్కెట్ రాబడులకు అనుగుణంగా సర్దుబాటు చేశారు. 2005-06 మధ్య పీఎఫ్ వడ్డీ రేటు 8.50 శాతంగా ఉంది. 2025-26కు వచ్చే సరికి పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతానికి తగ్గిపోయింది.