RR vs MI: రాజస్థాన్ విజయాలకు ముంబై కళ్లెం వేస్తుందా? గువాహటిలో టఫ్ ఫైట్!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 7న 13వ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్, పడుతూ లేస్తూ ముందుకెళ్తున్న ముంబై ఇండియన్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. గువాహటి వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. సీఎస్కేపై విజయంతో ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుని పూర్తి స్థాయి కాన్ఫిడెంట్‌గా ఉంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ ముందు బోల్తా పడింది. దాంతో ఈ మ్యాచ్ ముంబైకి కీలకంగా మారనుంది. ఐపీఎల్ చరిత్రలో మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్ల మధ్య పోటాపోటీగా జరిగినా ముంబై 16 మ్యాచ్‌లలో గెలిస్తే, రాజస్థాన్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2021 నుంచి జరిగిన ఎనిమిది మ్యాచ్‌లలో ముంబై ఐదు మ్యాచ్‌లలో గెలిచి కొంత ఆధిపత్యం సాధించింది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురేల్ వంటి యువ ఆటగాళ్లతో రాజస్థాన్ మంచి జోష్‌లో కనిపిస్తే.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి లెజెండ్స్‌తో ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. యువతరానికి అనుభవతరానికి మధ్య జరిగే ఈ పోరులో విజయం ఎవరివైపు నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అంచనాయశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, డొనోవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, బర్గర్, రవి బిష్ణోయ్. ముంబై ఇండియన్స్ జట్టు అంచనారోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్‌ఫేన్ రూధర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే.