హైదరాబాద్ కంపెనీ రూ.800 కోట్ల షేర్ బైబ్యాక్.. ఒక్కో షేరుకు అదనంగా రూ.135 చెల్లింపు.. ఏప్రిల్ 17లోపు కొన్నవారికే అర్హత!

Wait 5 sec.

Share Buyback: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటైన అరబిందో ఫార్మా తమ షేర్ హోల్డర్లకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. పెద్ద ఎత్తున షేర్ల బైబ్యాక్‌కు నిర్ణయించింది. రూ.800 కోట్లతో తమ కంపెనీకి చెందిన షేర్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సోమవారం ఆమోదం తెలిపారు. బైబ్యాక్ ఆఫర్ ద్వారా రూ.1 ముఖ విలువ గల మొత్త 54.23 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరు కొనుగోలు ధరను రూ.1475గా నిర్ణయించారు. ఈ బైబ్యాక్‌లో పాల్గొనే షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డ్ తేదీని ఏప్రిల్ 17గా నిర్ణయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం రూ.1340 వద్ద ఉంది. బైబ్యాక్ షేరు ధరను రూ. 1475గా నిర్ణయించారు. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే అదనంగా రూ.135 వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో బైబ్యాక్ చేసే వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. అరబిందో ఫార్మా ఇలా షేర్ల బైబ్యాక్ చేయడం 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇది రెండోసారి. 2024, ఆగస్టులో షేరు రూ.1460 ధరతో మొత్తం రూ.750 కోట్లతో బైబ్యాక్ చేపట్టింది. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో బైబ్యాక్ ప్రకటించింది. సాధారణంగా కంపెనీలు తమ వాటాను తిరిగి పెంచుకునేందుకు ఇలా అధిక ధర వద్ద షేర్ బైబ్యాక్ ప్రకటిస్తుంటాయి. స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్‌లో అరబిందో ఫార్మా షేరు ధర 0.49 శాతం లాభంతో రూ.1340.20 వద్ద ముగిసింది. ఈ షేరు గత వారంలో 2.31 శాతం, గత నెల రోజుల్లో 7.45 శాతం, గత ఆరు నెలల కాలంలో 23 శాతం మేర లాభపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1359 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ.1010 వద్ద ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.77660 కోట్లుగా ఉంది. మరోవైపు.. . ప్రముఖ ఔషధం జొలైర్‌కు బయోసిమిలర్ గా దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. అకస్మాత్తుగా వచ్చే దద్దుర్లు, దురదలతో బాధపడే 608 మందిపై 7 ఐరోపా దేశాలు, భారత్‌లోని 80 కేంద్రాల్లో ఈ ఔషధ ప్రయోగాలు జరిపినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికం నాటికి అన్ని ప్రయోగాలు పూర్తయి ఈ ఔషధ అనుమతుల కోసం ఎఫ్డీఏ, ఈఎంఏలకు దరఖాస్తు చేయనున్నట్లు క్యూరాటెక్ తాజా ప్రకటన ద్వారా తెలియజేసింది.