5KG LPG Cylinder: దేశంలో వంట గ్యాస్ కొరత నెలకొంది. ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రమవడం, హార్ముజ్ జలసంధిలో భారత్‌కు రావాల్సిన ఎల్‌పీజీ నౌకలు చిక్కుకుపోవడం వంటి కారణాలతో ఈ కొరత ఏర్పడింది. అయితే, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. గ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికులు, విద్యార్థులు, తక్కువ ఆదాయ వర్గాల కోసం కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకుమినీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. గతంలో ఉన్న ఎల్‌పీజీ సరఫరా పరిమితులను సవరిస్తూ వలస కార్మికుల అవసరాల కోసం అదనపు కోటాను కేటాయించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రభుత్వం ఆదేశించింది. వలస కార్మికులు, విద్యార్థులు తమ వద్ద స్థానిక అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా కేవలం ఆధార్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం సమర్పించి ఈ 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ను పొందవచ్చని తెలిపింది. 14.2 కిలోల పెద్ద సిలిండర్లు కొనలేని వారికి, రీఫిల్లింగ్ ధర తక్కువగా ఉండే 5 కిలోల సిలిండర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త పాలసీ అమలులోకి వచ్చిన తొలి రోజే దేశంలో దాదాపు 90 వేల సిలిండర్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక మార్చి 23 నుంచి చూస్తే 6.6 లక్షల సిలిండర్లను వలస కార్మికులకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. చేపట్టింది. అలాగే కమ్యూనిటీ కిచెన్లు, ఆసుపత్రులు, వలస కార్మికులు, డైరీ రంగానికి గ్యాస్ సరఫరాలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలకు అందించే మొత్తం ఎల్‌పీజీ సరఫరాను 20 శాతం మేర పెంచింది. పాత సాధారణ స్థితిలో 70 శాతం స్థాయికి చేరుకున్నట్లు తెలిపింది. ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ కింద లభించే ఈ చిన్న సిలిండర్లు వలస కార్మికులు, విద్యార్థుల వంటి వారికి వంట గ్యాస్ కష్టాలను తీర్చనున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ తమ గ్యాస్ ఏజెన్సీల ద్వారా 5 కిలోల సిలిండర్లను విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చాయి. మినీ సిలిండర్లతో గ్యాస్ కొరతకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టాయి.