PSU Banks Merger: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల విలీనం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు, మూడు బ్యాంకులను కలిపి ఒకే పెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందా అని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి క్లారిటీ ఇచ్చారు. లేదా స్థిరీకరణ వంటి ప్రతిపాదనలు ఏవీ ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో లేవని ఆయన స్పష్టం చేశారు. గతంలో కొన్ని పీఎస్‌బీ బ్యాంకుల విలీనం ద్వారా బలమైన బ్యాంకుల ఏర్పాటుకు వీలైందని లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. , తక్కువ వ్యయాల డిపాజిట్లకు వీలు కల్పించడం, పోటీతత్వ కార్యకలాపాలకు వీలు కలిగిందన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేశారు. 2019, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ విలీనం అమలులోకి వచ్చినట్లు గుర్తు చేశారు. 2019 మార్చి నెలలో ఈ మూడు బ్యాంకుల వ్యాపారం రూ. 16.1 లక్షల కోట్లుగా ఉంటే 2025 మార్చి నాటికి రూ. 27 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పీఎన్‌బీలో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ విలీనం 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. 5 సంవత్సరాల్లో వీటి వ్యాపారం రూ. 18.3 లక్షల కోట్ల నుంచి రూ. 26.80 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపారు.ఈ విలీనం 2020, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 5 ఏళ్లలో ఈ బ్యాంకుల వ్యాపారం రూ. 15.3 లక్షల కోట్ల నుంచి రూ. 22.9 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకును 2020 ఏప్రిల్ 1న కలపగా 2025 మార్చి నాటికి విలీన బ్యాంకు వ్యాపారం రూ. 15.7 లక్షల కోట్ల నుంచి రూ. 25.3 లక్షల కోట్లకు పెరిగినట్లు చెప్పారు. అలహాబాద్ బ్యాంకులో ఇండియన్ బ్యాంక్ విలీనం అయింది. గత 5 సంవత్సరాల్లో ఈ బ్యాంకుల వ్యాపారం రూ. 8.60 లక్షల కోట్ల నుంచి రూ. 13.30 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి మిగితా బ్యాంకుల విలీన ప్రతిపాదనలు ప్రస్తుతానికి తమ వద్ద లేవని కేంద్ర మంత్రి పంకజ్ ఛౌదరీ లోక్‌సభలో స్పష్టం చేశారు.