: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెక్టార్ కంపెనీ హింద్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవల బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. అంటే మార్చి 26వ తేదీ మార్కెట్లు ముగిసే నాటికి షేర్లు కొన్నవారికి అర్హత లభిస్తుంది. మార్చి 27న ఈ కంపెనీ షేర్స్ ఎక్స్ - బోనస్ ట్రేడ్ చేయనున్నాయి. బోనస్ ఇష్యూ ప్రకారం 1 షేర్ కొంటే అదనంగా మరో షేర్ ఉచితంగా బోనస్ రూపంలో వస్తుంది. అంతే కాదు ఈ స్టాక్ గత 5 ఏళ్ల కాలంలో లక్ష రూపాయలని రూ.12 లక్షలు చేసింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 1:1 రేషియోలో బోనస్ షేర్ల ఇచ్చేందుకు ఆమోదం తెలుపారు. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 షేర్ కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటారో వారికి అదనంగా రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉండే మరో షేరును బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్ల పొందేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ మార్చి 27, 2026గా డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. చివరి ట్రేడింగ్ సెషన్లో హింద్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ షేరు 3.9 శాతం నష్టంతో రూ. 1430.10 వద్ద ముగిసింది. ఈరోజు ట్రేడింగ్ చూసుకుంటే ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 2,108.50, కనిష్ఠ ధర రూ. 799 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 1 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో సుమారు 2 శాతం లాభపడింది. గత ఆరు నెలల్లో 13 శాతం నష్టాన్ని మిగిల్చింది. ఏడాది కాలంలో 46 శాతం లాభాన్ని అందించింది. గత ఐదేళ్ల కాలంలో 1100 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 2530 కోట్ల వద్ద ఉంది. అయితే ఈ కథనం కేవలం సమాచారం ఇవ్వడానికే. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. అన్ని విషయాలు తెలుసుకుని, పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టాలి.