SBI FD Rate Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి అదిరే శుభవార్త అందించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్న తరుణంగా ఎస్‌బీఐ వడ్డీ రేట్లను పెంచి డిపాజిటర్లకు అదనపు ప్రయోజనాన్ని ఆఫర్ చేస్తోంది. తాజాగా ప్రకటించింది. ఎస్‌బీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లను మార్చి 15, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. మరి టెన్యూర్ డిపాజిట్లపై ఎంత మేర వడ్డీ పెంచింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ఎస్‌బీఐ తెలిపింది. 46 రోజుల నుంచి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల వడ్డీ రేటును 5.10 శాతం నుంచి 5.35 శాతానికి పెంచినట్లు వెల్లడించింది. అలాగే 180 రోజుల నుంచి ఏడాదిలోపు టెన్యూర్ గల డిపాజిట్లక వడ్డీ రేటును 5.60 శాతం నుంచి 5.85 శాతానికి పెంచింది. అలాగే ఏడాది నుంచి రెండేళ్ల లోపు టెన్యూర్ గల బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటును 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. ఇక స్టాండర్డ్ ఎఫ్‌డీ రేట్లతో పోలిస్తే అదనపు వడ్డీ రేటు బెనిఫిట్‌ కల్పిస్తోంది ఈ బ్యాంక్. 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ బల్క్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటును 5.60 శాతం నుంచి 5.85 శాతానికి పెంచింది. ఇక 180 రోజుల నుంచి ఏడాదిలోపు టెన్యూర్ గల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటును 6.10 శాతం నుంచి 6.35 శాతానికి పెంచింది. ఇక ఏడాది నుంచి 2 ఏళ్లలోపు మెచ్యూరిటీ పీరియడ్ గల బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.75 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. అయితే, సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లు ఫ్రెష్ డిపాజిట్లు, మెచ్యూర్ అయిన తర్వాత రెన్యూవల్ చేస్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది. మిగితా అన్ని షరతులు, నిబంధనలు రిటైల్, బల్క్ టెర్మ్ డిపాజిట్లకు ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. రూ.3 కోట్లకు పైగా చేసే డిపాజిట్లకు ప్రస్తుతం ఎస్‌బీఐ మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇది ఒక మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. అయితే బల్క్ టర్మ్ డిపాజిట్ల ప్రీమెచ్యూర్ పెనాల్టీ 1 శాతంగా ఉంటుందని గమనించాలి. కొత్త డిపాజిట్లతో పాటు రెన్యూవల్స్ కి సైతం ఈ పెనాల్టీ వర్తిస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ ముగియక ముందే విత్ డ్రా చేసుకుంటే ఈ మేరకు 1 శాతం మేర వడ్డీ తగ్గిస్తారు.