శుభవార్త.. డివిడెండ్ ప్రకటించిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్.. ఒక్కో షేరుకు ఎంతంటే?

Wait 5 sec.

: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. ఇక్కడ కేవలం స్టాక్ ధరలు పెరగడంతోనే కాదు.. దీర్ఘకాలంలో ఇంకా వేరే కారణాల వల్ల కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వస్తుంటాయి. వీటిల్లో కంపెనీలు దీర్ఘకాలంలో తమ మూలధన లాభాల నుంచి ఇన్వెస్టర్లకు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగానే.. డివిడెండ్ ప్రకటిస్తుంటాయి. ఇక్కడ , ఫైనల్ డివిడెండ్, స్పెషల్ డివిడెండ్ ఇలా ఉంటాయి. వీటితో పాటుగా.. బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్, షేర్ల బైబ్యాక్ వంటివి ఉంటాయి. వీటితోనే అదనంగా వస్తుంటాయి. డివిడెండ్ విషయానికి వస్తే.. ఒక్కో షేరుకు ఇంత చొప్పున ఆఫర్ చేస్తంటాయి. ఇక్కడ డివిడెండ్ నేరుగా షేర్ హోల్డర్ల అకౌంట్లలోనే జమవుతుంటుంది. ఇప్పుడు ఇప్పుడు షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ స్టాక్ ఫేస్ వాల్యూ ఒక్కో షేరుకు రూ. 10 గా ఉండగా.. దీంట్లో ఏకంగా 80 శాతం డివిడెండ్ ప్రకటించడం విశేషం. ఈ డివిడెండ్ కోసం కంపెనీ ఏప్రిల్ 2 ను రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. అంటే ఆలోపు ఈ కంపెనీ షేర్లు కలిగి ఉన్న వారికి డివిడెండ్ వస్తుంది. ఇక డివిడెండ్ చెల్లింపుల్ని ఏప్రిల్ 25 లోపు చేయనుంది. ఇక చెన్నై పెట్రోలియం షేరు విషయానికి వస్తే ప్రస్తుతం సరిగ్గా రూ. 1000 వద్ద ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1103 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 527 గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 14.93 వేల కోట్లుగా ఉంది. గత 5 రోజుల్లో చూస్తే ఈ స్టాక్ ధర 5 శాతం వరకు పడిపోయింది. నెలలో ఫ్లాట్‌గా ట్రేడ్ అయింది. 6 నెలల్లో చూసినట్లయితే 31 శాతం మేర పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18 శాతం పుంజుకుంది. ఏడాది వ్యవధిలో చూస్తే 60 శాతం ఎగబాకింది. ఈ కంపెనీకి మంచి డివిడెండ్ల చరిత్ర ఉంది.ట్రెండీలైన్ డేటా ప్రకారం.. 2004 నుంచి ఇప్పటివరకు 17 సార్లు డివిడెండ్లను ప్రకటించడం విశేషం. ఈ కంపెనీ క్యూ3 ఫలితాల విషయానికి వస్తే ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 1001.59 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా అంతకుముందు రూ. 15,687.64 కోట్లుగా ఉండగా.. ఇది క్యూ3లో రూ. 19,467.40 కోట్లకు చేరుకుంది. గమనిక: పైన ఇచ్చింది కేవలం సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.