క్రికెట్ కాదిది కాసుల పంట..! ఒక్కో ఐపీఎల్ టీమ్ విలువే రూ.47 వేల కోట్లు..? ఆర్సీబీ, రాజస్థాన్ డీల్స్‌తో డబ్బుల వరద!

Wait 5 sec.

అంటే కేవలం ఓ ఎంటర్‌టైన్‌మెంటే కాదు.. బిలియన్ డాలర్ల బిజినెస్. ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లంతా సందడి చేసే ఏకైక వేదిక ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్రికెట్ ప్రపంచాన్నంత భారత దేశం మధ్యలోనే నిలబెట్టేందుకు 2008లో మొదలుపెట్టిన ఓ ప్రయత్నం ఇప్పుడు కాసుల పంట కురిపిస్తోంది. ప్రారంభానికి ముందు జరిగిన రెండు భారీ డీల్స్‌ బడా బడా బిజినెస్ మ్యాన్‌లంతా ఐపీఎల్ వైపు చూసేట్టు చేశాయి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్మకాలతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల విలువలు ఆకాశాన్ని తాకాయి. ఐపీఎల్ 2025 తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు అమ్మకానికి పెట్టక తప్పలేదు. అయితే, ఈ డీల్ ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకో రెండు రోజులే మిగిలింది అనగా పూర్తయింది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ పార్ట్‌నర్స్ సుమారు రూ. 16,706 కోట్లకు కొనుగోలు చేయగా, రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికా బేస్ కంపెనీ రూ. 15,290 కోట్లకు దక్కించుకుంది. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ రెండూ ఫ్రాంఛైజీలు కలిసి రూ. 31,000 కోట్లకు అమ్ముడయ్యాయి. యాడ్స్, ప్రమోషన్స్ వీటితో ఐపీఎల్ జట్లు కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్నాయి. దాంతో రానున్న పదేళ్లలో ఒక్కో ఐపీఎల్ ఫ్రాంఛైజీ విలువే సుమారు రూ. 37,600 కోట్ల నుంచి రూ. 47,000 కోట్ల వరకు చేరుతుందని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ అంచనా వేశారు. "నేను 2019లో ఐపీఎల్‌లోకి వచ్చినప్పుడు 50 శాతం షేర్ కోసం రూ. 550 కోట్లు పెట్టడం అప్పట్లో చాలా పెద్ద రిస్క్‌లా అనిపించింది. ఇప్పుడు చూస్తే బిజినెస్ మ్యాన్‌లకు అది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లా మారింది. తాజాగా మీడియా హక్కులే రూ. 50 వేల కోట్లకు అమ్ముడైనప్పుడే ఐపీఎల్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. భారీ వ్యూయర్‌షిప్, బ్రాండ్స్ అన్నీ కలిసి ఐపీఎల్‌ను కాస్ట్లీ లీగ్‌గా మార్చాయి" అని పార్ఠ్ జిందాల్ చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలులో అంతర్జాతీయ బిజినెస్ మెన్‌లు ఇన్వెస్ట్ చేయడం విశేషం. దాంతో రానున్న కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కేవలం పది జట్లకే పరిమితమైన ఐపీఎల్ భవిష్యత్‌లో ఇంకొన్ని పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్సీబీ, ఆర్ఆర్ భారీ డీల్స్ తర్వాత ఐపీఎల్ రేంజ్ ఇంకాస్త పెరిగింది.