పశ్చిమాసియాలో యుద్ధం ఉద్ధృతి తీవ్రమైంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేసి, చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు చెప్పినదానికి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏమాత్రం పొంతనలేదు. ఇరాన్, లెబనాన్‌లపై ఇజ్రాయెల్- అమెరికా సైన్యాలు దాడులు కొనసాగిస్తుండగా.. అటు, కూడా గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇక,వీడటం లేదు. తాజాగా, పాకిస్థాన్‌‌కు ఇరాన్ ఝలక్ ఇచ్చింది. హర్మూజ్ నుంచి కరాచీకి వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు వెనక్కి పంపాయి. కరాచీకి వెళ్తున్న కంటెయినర్ నౌకను అనుమతి లేని కారణంగా వెనక్కి పంపినట్టు తెలిపింది. అలీరెజా తంగ్సిరి ప్రకారం... చట్టపరమైన నిబంధనలను పాటించడంలో విఫలమైన సెలెన్‌గా గుర్తించిన ఆ నౌకను IRGC నౌకాదళం అడ్డగించింది. వ్యూహాత్మక జలమార్గంలోకి ప్రవేశించే ముందు అన్ని నౌకలు ఇరాన్ నేవీ అధికారులతో పూర్తిగా సమన్వయం చేసుకోవాలని తంగ్సిరి పేర్కొన్నారు. ఈ చర్య ఇరాన్ సార్వభౌమాధికార ప్రకటన అని, ప్రజా మద్దతుతోనే ఇది సాధ్యమైందని ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటైన హర్మూజ్‌పై ఇరాన్ తన నియంత్రణను మరింత కఠినతరం చేస్తోందన్న విషయాన్ని ఈ చర్య స్పష్టం చేస్తోంది.ఇదిలా ఉండగా, బుధవారం మహమ్మద్ బిన్ సల్మాన్‌కు వివరించారు. శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ.. ఉద్రిక్తతలను తగ్గించడం, యుద్ధానికి ముగింపు పలకడం, ముస్లిం ప్రపంచంలో ఐక్యత ఆవశ్యకతను షరీఫ్ నొక్కి చెప్పారు. ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు తమ బలమైన మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన ఇప్పటికే ఇస్లామాబాద్ ద్వారా టెహ్రాన్‌కు చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉండగా, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ యూఏఈ, యూకే, చైనా విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఈ సంక్షోభం నివారణకు చర్చలే ఏకైక పరిష్కార మార్గమని ఆయన పేర్కొన్నారు.