: వరుస నష్టాల నుంచి భారత స్టాక్ మార్కెట్ సూచీలు తేరుకుంటున్నాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్చి 25న సెన్సెక్స్ ప్రస్తుతం వార్త రాసే సమయంలో (మధ్యాహ్నం 2 గంటలకు) 1600 పాయింట్లకుపైగా లాభంతో 75,750 స్థాయిలో ఉంది. నిఫ్టీ 530 పాయింట్లు పుంజుకొని 23,450 స్థాయిలో కదలాడుతోంది. ఇక్కడ పలు ప్రధాన రంగాల స్టాక్స్ రాణిస్తుండగా.. ఇక్కడ సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది బుధవారం సెషన్‌ ఇంట్రాడేలో ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. మార్చి 24న రూ. 600.75 వద్ద ముగిసిన ఆర్పీఎస్‌జీ షేర్ ధర ఇవాళ నేరుగా 10 శాతం లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. తర్వాత ఏ దశలోనూ తగ్గలేదు. ఇంకా పెరిగి ఇంట్రాడేలో 20 శాతం మేర అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 720.90 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. ప్రస్తుతం 18 శాతానికిపైగా లాభంతో 710 స్థాయిలో ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 2.36 వేల కోట్లుగా ఉంది.ఐపీఎల్ టీమ్ ఫ్రాంఛైజీల విక్రయం..!ఇక్కడ ఈ స్టాక్ ఇంతలా పెరిగేందుకు . అవును.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి మార్చి 24న కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు ఫ్రాంఛైజీలు చేతులు మారాయి. లీగ్‌లోనే అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటి, కిందటిసారి ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహా రాజస్థాన్ రాయల్స్ వేరే యాజమాన్యాల అధీనంలోకి వెళ్తున్నాయి.ఆర్సీబీని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్.. ఏకంగా రూ. 16,706 కోట్ల రికార్డు ధరకు విక్రయించింది. , బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్ ఇలా నాలుగు సంస్థలు కలిపి దీనిని దక్కించుకున్నాయి. అమెరికా టెక్ వ్యాపారవేత్త కల్ సోమనీ మరో 2 సంస్థలతో కలిసి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని రూ. 15,300 కోట్లకు దక్కించుకున్నారు. ఇక్కడ వీటి వాల్యుయేషన్.. ఐపీఎల్ క్రేజ్‌కు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇంతటి భారీ స్థాయిలో ఒక ఐపీఎల్ టీమ్ ఫ్రాంఛైజీకి విలువ ఉండటంతోనే.. ఇదే ఐపీఎల్‌కు కనెెక్షన్ ఉన్న ఆర్పీఎస్‌జీ వెంచర్స్ స్టాక్ ఒక్కసారిగా పుంజుకుంది. ఇన్వెస్టర్లు.. ఆసక్తితో ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారని చెప్పొచ్చు. ఆర్పీఎస్‌జీ వెంచర్స్ లిమిటెడ్ సంస్థే.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ యజమానిగా ఉంది. దీనికి . ఆర్సీబీ వాల్యూ ఇంతలా ఉండటంతో.. మిగతా ఐపీఎల్ ఫ్రాంఛైజీల విలువ కూడా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఇదే ఊపులో ఈ స్టాక్‌పై ఆసక్తి చూపించారని చెప్పొచ్చు. సన్ టీవీ షేర్లు ఒక్కసారిగా పెరిగి పతనం..!ఇదే సమయంలో ఫ్రాంఛైజీ ఓనర్‌గా ఉన్న సన్ టీవీ స్టాక్ కూడా మార్చి 25 సెషన్ ఆరంభంలో భారీగానే పెరిగింది. కిందటి రోజు రూ. 616.30 వద్ద ముగియగా.. బుధవారం రోజు ప్రారంభంలో 3 శాతానికిపైగా లాభంతో మొదలై ఇంట్రాడేలో 5 శాతానికిపైగా పెరిగి రూ. 649.35 వద్ద గరిష్ఠాన్ని తాకింది. కానీ గరిష్ఠాల వద్ద మళ్లీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా అమ్మకాలు పెరిగి.. వెనక్కి తగ్గింది. వార్త రాసే సమయంలో 1.50 శాతం వరకు నష్టంతో రూ. 607 స్థాయిలో ఉంది. ఈ సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 23.95 వేల కోట్లుగా ఉంది. సన్‌రైజర్స్ సీఈఓగా కావ్య మారన్ ఉన్నారు. ఈమె కళానిధి మారన్ కుమార్తె. ఇక్కడ సన్ టీవీ షేర్ ధర గరిష్ఠాల నుంచి తగ్గేందుకు మరో కారణం ఉంది. పైన ఆర్పీఎస్‌జీ వెంచర్స్ కంపెనీకి లక్నో సూపర్ జెయింట్స్ ప్రధాన అసెట్‌గా ఉంది. సన్ టీవీకి.. ఎస్ఆర్‌హెచ్ ఒక భాగం మాత్రమే. సన్ టీవీ ప్రధాన ఆదాయం అనేది బ్రాడ్‌కాస్టింగ్, అడ్వర్టైజ్‌మెంట్ నుంచి వస్తుంది. ప్రస్తుతం మీడియా రంగంలో మందగమనం వల్ల.. గరిష్ఠ స్థాయిల నుంచి అమ్మకాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఇంకా ఈ స్టాక్ ఆల్ టైమ్ హై రూ. 691.40 కాగా.. గరిష్ఠాల వద్దే లాభాల్ని ఇవాళే సొమ్ముచేసుకున్నారు ఇన్వెస్టర్లు.