హర్మూజ్‌లో నౌకలకు టోల్ ఫీజు.. స్పందించిన భారత్‌లోని ఇరాన్ ఎంబసీ

Wait 5 sec.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తోంది. పర్షియన్ గల్ఫ్‌లోనివసూలు చేయనున్నట్టు జరుగుతోన్న ప్రచారంపై ఇరాన్ స్పందించింది. అదనపు ఛార్జీలకు సంబంధించి అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఖండించింది. కొంత మంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారని పేర్కొంది. వాటితో టెహ్రాన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని.. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. నౌకల నుంచి 2 మిలియన్‌ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.18 కోట్లు) చొప్పున వసూలు చేయనున్నట్టు నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ మెంబర్ అలాయుద్దీన్‌ బరూజెర్దిని ప్రకటించినట్లు ఇరాన్ మీడియా వార్తలను ప్రసారం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల ఖర్చులు పెరగడం వల్ల అదనంగా ఛార్జీలు వసూలు చేయాల్సివస్తోందని అన్నట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా, హర్మూజ్‌ జల సంధిని 48 గంటల్లోగా తెరవాలని, లేకుంటే దాడులకు చేస్తామని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్.. యుద్ధాన్ని తాత్కాలికంగా ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఇరాన్ మాత్రం తాము అమెరికా అధ్యక్షుడు ప్రకటనలను నమ్మబోమని, యుద్ధం ఆపబోమని స్పష్టం చేసింది. అంతేకాదు, హర్మూజ్‌లో శత్రువుల ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడం కొనసాగుతుందని తెలిపింది.ఇదిలా ఉండగా, అంతర్జాతీయ ఇంధన సంస్థ చీఫ్ ఫాతిహ్‌ బిరోల్‌ ప్రస్తుత సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో 40కి పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు.