ఇరాన్‌తో యుద్దం విషయంలో అంచనాల తల్లకిందులు కావడంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విబేధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ వారంలో మధ్య జరిగిన ఓ ఫోన్ సంభాషణ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరువురి మధ్య వాదోపవాదాలు దారితీసినట్టు తెలుస్తోంది. ఇరాన్‌పై యుద్ధంపై నెతన్యాహు ఎక్కువగా అంచనా వేసి బొక్కబోర్లాపడ్డారని వాన్స్ అసహనం వ్యక్తం చేసినట్టు యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇరాన్‌లో పాలన మార్పు త్వరగానే జరుగుతుందనే నమ్మకంపై వాన్స్ అనేక ప్రశ్నలు లేవనెత్తినట్టు తెలిపింది.‘‘యుద్ధానికి ముందు ఇరాన్‌‌లో పాలన మార్పు సాధ్యమేనని బీబీ (నెతన్యాహు నిక్ నేమ్) అధ్యక్షుడు ట్రంప్‌ను నమ్మించారు.. కానీ, వాస్తవ పరిస్థితులు అంత ఈజీ కాదని వైస్-ప్రెసిడెంట్ స్పష్టం చేశారు’’ అని అమెరికా అధికారి ఒకరు అధికారి పేర్కొన్నారు. ఆ కాల్ తర్వాత ఇరాన్‌తో చర్చలలో కీలకంగా వ్యవహరిస్తోన్న వాన్స్‌‌ ప్రాధాన్యతను తగ్గించేలా వ్యూహాత్మకంగా ప్రతికూల ఇజ్రాయెల్ ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. చర్చలకు ఆయననే ఇరాన్ కోరుతుందనే ప్రచారం కూడా ఇజ్రాయెల్ వ్యూహం కావచ్చిన ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ట్రంప్, ఆయన అల్లుడు కుష్నర్‌లతో తాము చర్చించబోమని, జేడీ వాన్స్‌పై తమకు నమ్మకం ఉందని ఇరాన్ అన్నట్టు నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే. నిరంతరం విదేశాల్లో యుద్ధాలను దీర్ఘకాలంగా విమర్శిస్తున్న వాన్స్.. ఇరాన్, అమెరికా మధ్య చర్చలలో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో పాటు ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంఘర్షణ మరో ముగింపులేని యుద్ధంగా మారకూడదని ఆయన కోరుకుంటున్నారు. అయితే, ఇరాన్‌తో ఒప్పందం జరగాలంటే జేడీ వాన్స్‌నే కీలకమని, ఆయనతో కాకుంటే మరెవరితోనూ సాధ్యం కాదని మరో అమెరికా అధికారి వ్యాఖ్యానించారు. ట్రంప్-వాన్స్ మధ్య అభిప్రాయబేధాలుఇక, 2028 ఎన్నికల్లో పోటీపై కన్నేసిన అమెరికా ఉపాధ్యక్షుడు .. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా బయట కనిపించడం లేదు. ఇరాక్‌లో పనిచేసిన ఈ మాజీ మెరైన్... ఇకపై అమెరికాను సుదీర్ఘ విదేశీ యుద్ధాలకు దూరంగా ఉంచాలని కోరుకునే వ్యక్తిగా తనకంటూ ఒక రాజకీయ గుర్తింపును సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విషయంలో తనతో వాన్స్‌కు అభిప్రాయబేధాలు ఉన్నాయని సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడం గమనార్హం. కానీ, వాన్స్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తూ.. మునుపటి నాయకత్వంతో పోల్చితే ట్రంప్ తెలివైన అధ్యక్షుడని, గత తప్పిదాలను ఆయన పునరావృతం కాకుండా చూస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.